బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ బందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కత్రినాకు ఏ సమస్య వచ్చినా ముందుగా సల్మాన్ స్పందిస్తారన్నది బాలీవుడ్ ఎరిగిన సత్యం. కెరీర్ పరంగా కూడా కత్రినాకు సల్మాన్ ఎంతో సాయం చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టి కొద్ది రోజులు డేటింగ్ కూడా చేశారు. కానీ కొన్ని కారణాల వలన విడిపోయి.. ప్రస్తుతం స్నేహితులుగా కొనసాగుతున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల కత్రినా ఫ్లేమస్లీ ఫిలింపేర్ అనే కార్యక్రమానికి వెళ్లగా.. సల్మాన్‌ను పెళ్లి చేసుకోవచ్చుగా అని ఓ అభిమాని నిర్మొహమాటంగా అడిగేశారట. ప్లీజ్ మేడమ్.. సల్మాన్ మీకు పర్‌ఫెక్ట్. ఆయన్ను పెళ్లి చేసుకోండి అంటూ ఓ పోస్టర్‌పై రాసి కత్రినాకు చూపించాడట. ఇది చూసిన కత్రినా ఊ అంటూ సమాధానమిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారట. అయితే కత్రినా రియాక్షన్ పెళ్లికి ఓకేనా..? కాదా..? అన్నది అర్థం కాక ఆ అభిమాని తికమకపడుతున్నాడట. కాగా కత్రినా, సల్మాన్‌లు జంటగా మైనే ప్యార్ క్యూ కియా, ఏక్ టైగర్, టైగర్ జిందా హై, యువరాజ్, పార్ట్‌నర్ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం సల్మాన్ నటిస్తోన్న భారత్‌లోనూ అతడితో కత్రినా జోడీ కట్టిన విషయం తెలిసిందే.