F2 sequel: వెంకీ భారీ డిమాండ్.. ఆయన పాత్రలో ఆ స్టార్ హీరో..!

ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరుతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకొని వరుసగా ఐదు హిట్లతో దూసుకెళ్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ దర్శకుడు ఎఫ్ 2 సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

F2 sequel: వెంకీ భారీ డిమాండ్.. ఆయన పాత్రలో ఆ స్టార్ హీరో..!
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2020 | 8:09 AM

ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరుతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకొని వరుసగా ఐదు హిట్లతో దూసుకెళ్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ దర్శకుడు ఎఫ్ 2 సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పుడు జరుగుతుండగా.. దిల్ రాజు ఈ సీక్వెల్‌ను నిర్మించబోతున్నారు. ఇక ఈ సీక్వెల్‌లో ‘ఎఫ్ 2’లో నటించిన వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కంటిన్యూ అవుతారని.. వారితో పాటు స్టార్ హీరో కూడా భాగం అవుతారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్‌లో నటించేందుకు వెంకటేష్ భారీగా డిమాండ్ చేస్తున్నారట.

మొదటి భాగం పెద్ద విజయం సాధించడంతో రెండో భాగం కోసం దాదాపు రూ.10కోట్ల రెమ్యునరేషన్ అడుతున్నారట. అయితే వెంకీ డిమాండ్‌పై దిల్ రాజు సానుకూలంగా లేరట. ఈ క్రమంలో ఆయన స్థానంలో రవితేజను తీసుకుందామని సూచించారట. కానీ ఈ విషయంలో అనిల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదట. ఎఫ్ 2 విజయంలో వెంకటేష్ పాత్ర ఎక్కువగా ఉండగా.. ఆయన పాత్రలో మరొకరికి ఊహించుకోవడం కష్టమని దిల్ రాజుకు చెప్పారట. ఎలాగైనా వెంకటేష్‌ను ఒప్పించాలని అనిల్ అన్నారట. అయితే స్క్రిప్ట్ మొత్తం అయ్యాక తరువాత నటీనటులను ఎంపిక చేద్దాం అన్న ఆలోచనలో దిల్ రాజు పడ్డట్లు తెలుస్తోంది. మరి ఎఫ్ 3లో వెంకటేష్ ఉంటారా…? ఉండరా..? ఈ క్రేజీ సీక్వెల్‌లో ఎవరెవరు నటించబోతున్నారు..? అన్న విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని జూన్ నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లి.. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ప్లాన్‌లో అనిల్ ఉన్నట్లు సమాచారం.

Read This Story Also: ’ఎఫ్ 2′ సీక్వెల్‌లో మహేష్.. డేట్లు ఇచ్చిన సూపర్‌స్టార్..!

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు