మంచు విష్ణు- శ్రీను వైట్లల ‘ఢీ అండ్‌ ఢీ’.. ఆ ఇద్దరు హీరోయిన్లలో ఒకరిని ఫిక్స్ చేయనున్నారా..!

మంచు విష్ణు- శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ఢీ అండ్‌ ఢీ - డబుల్‌ డోస్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 2007లో విడుదలై ఘన విజయం సాధించిన

మంచు విష్ణు- శ్రీను వైట్లల 'ఢీ అండ్‌ ఢీ'.. ఆ ఇద్దరు హీరోయిన్లలో ఒకరిని ఫిక్స్ చేయనున్నారా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 24, 2020 | 8:34 PM

D & D- Double Dose:మంచు విష్ణు- శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ఢీ అండ్‌ ఢీ – డబుల్‌ డోస్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 2007లో విడుదలై ఘన విజయం సాధించిన ఢీ సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను సోమవారం మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఇచ్చేశారు. దీంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ సీక్వెల్‌లో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారు..? ఢీలో బ్రహ్మానందం, శ్రీహరి పాత్రలను ఇప్పుడు ఎవరితో చేయిస్తారు..? అన్న చర్చ ఫిలింనగర్‌లో జరుగుతోంది. (వినియోగదారులకు గూగుల్‌ పే షాకింగ్‌ న్యూస్‌.. నిలిచిపోనున్న వెబ్‌ యాప్ సేవలు.. అంతేకాదు..! )

ఈ క్రమంలో హీరోయిన్‌ పాత్రకు గానూ ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ప్రగ్యా జైశ్వాల్‌ని గానీ అనూ ఇమ్మాన్యుల్‌ని గానీ ఈ సీక్వెల్‌ కోసం తీసుకోనున్నట్లు సమాచారం. కాగా ప్రగ్యా ఇప్పటికే మంచు విష్ణు సరసన ఆచారి అమెరికా యాత్రలో నటించారు. మరి ఇందులో హీరోయిన్‌గా ఎవరు ఫైనల్‌ అవ్వనున్నారన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ఈ సినిమాను మంచు విష్ణునే నిర్మిస్తుండగా.. మహతి స్వర సాగర్‌ సంగీతం అందించనున్నారు. (ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌లోనే పరిహారం: వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు )