వినియోగదారులకు గూగుల్‌ పే షాకింగ్‌ న్యూస్‌.. నిలిచిపోనున్న వెబ్‌ యాప్ సేవలు.. అంతేకాదు..!

వెబ్​యాప్ సేవలు 2021 జనవరి నుంచి నిలిపివేయనున్నట్లు గూగుల్ పే తెలిపింది. అలాగే తక్షణ నగదు బదిలీకి ఛార్జీలు వసూలు చేసే యోచనలో గూగుల్ పే ఉన్నట్లు తెలుస్తోంది

వినియోగదారులకు గూగుల్‌ పే షాకింగ్‌ న్యూస్‌.. నిలిచిపోనున్న వెబ్‌ యాప్ సేవలు.. అంతేకాదు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 24, 2020 | 8:16 PM

Google Pay news: వెబ్​యాప్ సేవలు 2021 జనవరి నుంచి నిలిపివేయనున్నట్లు గూగుల్ పే తెలిపింది. అలాగే తక్షణ నగదు బదిలీకి ఛార్జీలు వసూలు చేసే యోచనలో గూగుల్ పే ఉన్నట్లు తెలుస్తోంది. (ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌లోనే పరిహారం: వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు )

గూగుల్ పే వెబ్​ యాప్​లో.. పీర్​-టూ-పీర్ పేమెంట్​ సదుపాయాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి నిలిపేసేందుకు సిద్ధమైంది. దీనితో పాటు తక్షణ నగదు బదిలీకి ఛార్జీలు వసులు చేయాలని భావిస్తున్నట్లు మీడియా నివేదికల ద్వారా తెలిసింది. గూగుల్​ పే ప్రస్తుతం మొబైల్ యాప్​ సహా.. పే డాట్ గూగుల్​ డాట్​కామ్ ద్వారా నగదు బదిలీ సేవలందిస్తోంది. జనవరి నుంచి వెబ్​ యాప్ సేవలు నిలిచిపోనున్నట్లు ఓ నోటీసులో పేర్కొంది గూగుల్ పే. మొబైల్ యాప్ సేవలు మాత్రం కొనసాగనున్నాయి.ఐఓఎస్​, ఐఓఎస్​ యూజర్లకు గూగుల్ పే సరికొత్త ఫీచర్లను ఇటీవలే పరిచయం చేసింది. తొలుత అమెరికాలోని వినియోగదారులకు ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్లు అందించి.. మిగతా యూజర్లకు ఇటీవలే ఈ ఫీచర్లను తీసుకొచ్చింది. (ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్‌.. తెలుగులో చిరంజీవి.. హిందీలో ఆమిర్‌ ఖాన్‌.!)