ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్‌.. తెలుగులో చిరంజీవి.. హిందీలో ఆమిర్‌ ఖాన్‌.!

ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. రియల్‌ కారెక్టర్స్‌తో కూడిన ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న

  • Tv9 Telugu
  • Publish Date - 7:02 pm, Tue, 24 November 20

RRR movie gossips: ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. రియల్‌ కారెక్టర్స్‌తో కూడిన ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. అలాగే అజయ్ దేవగన్‌, శ్రియ, అలియా భట్‌, ఒలివియా, సముద్ర ఖని వంటి స్టార్లు ఇందులో భాగం అయ్యారు. ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ ఇప్పుడు శరవేగంగా జరుగుతుండగా.. దీనికి సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్‌ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్‌ ఖాన్ భాగం అవ్వనున్నారట. (యూవీ క్యాంప్‌లోనే సుజీత్‌.. తదుపరి చిత్రాన్ని ఫిక్స్ చేసుకున్న సాహో దర్శకుడు.. త్వరలోనే అధికారిక ప్రకటన)

ఈ మూవీ తెలుగు వెర్షన్‌లో రామ్ చరణ్‌, ఎన్టీఆర్ కారెక్టర్‌లను చిరంజీవి పరిచయం చేయనుండగా.. హిందీలో ఆ పాత్రలను ఆమిర్‌ ఖాన్ పరిచయం చేయబోతున్నారట. చిరంజీవి, రాజమౌళికి మంచి సాన్నిహిత్యం ఉండటం దానికి తోడు.. చరణ్‌ ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవ్వడంతో చిరు వెంటనే ఈ ఆఫర్‌కి ఓకే చెప్పారట. మరోవైపు ఆమిర్‌కి రాజమౌళికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ ఇద్దరి డ్రీమ్ ప్రాజెక్ట్‌ మహాభారతం కాగా.. రాజమౌళితో పనిచేయాలనుందని ఆమిర్‌ కూడా ఓ సందర్భంలో తెలిపారు. ఆ సాన్నిహిత్యంతోనే రాజమౌళి అడగటం, ఆమిర్‌ ఓకే అని చెప్పడం జరిగిపోయాయని సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. (క్వారంటైన్‌ బబుల్‌లో రానా, సాయి పల్లవి.. షూటింగ్‌కి రెడీ అవుతోన్న ‘విరాట పర్వం’ టీమ్‌)