ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌లోనే పరిహారం: వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు

ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం అందేలా సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 7:28 pm, Tue, 24 November 20
ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌లోనే పరిహారం: వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు

Minister Kurasala Kannababu :ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం అందేలా సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతులకు సాయం చేసేందుకు గ్రామస్థాయిలో కమిటీలో ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సారి రబీ కోసం 121 రోజులు నీరు అందిస్తామని.. సాగునీటితో పాటు తాగునీటి అవసరాలకు కూడా నీరు అందిస్తామని ఆయన తెలిపారు. (ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్‌.. తెలుగులో చిరంజీవి.. హిందీలో ఆమిర్‌ ఖాన్‌.!)

ఇరిగేషన్ మెయింటెనెన్స్ పనులు వేగవంతం చేసినట్లు మంత్రి వివరించారు. కొన్ని పత్రికలు ప్రజలను గందరగోళ పరిచే విధంగా కథనాలు రాస్తున్నాయని.. రైతుల బకాయిలు 277 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టిన రైతుల బీమా సొమ్మును కూడా జగన్‌ చెల్లించారని కన్నబాబు అన్నారు. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంతో రైతులకు ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సందర్భంగా కన్నబాబు పేర్కొన్నారు. ఈ క్రాప్‌లో ఒక్కసారి పేరునమోదు చేసుకుంటే చాలని.. ఈ బీమా కోసం 30 పంటలను గుర్తించామని ఆయన అన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి ఏపీ పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారని.. వరదల్లో ఆయన కొడుకు ట్రాక్టర్ ఎక్కితే అది కాస్త కొల్లేరులోకి వెళ్ళిందని విమర్శించారు. ఇది నా మార్కు పథకం అని చంద్రబాబు ఒక్కటైనా చెప్పగలరా అన్న కన్నబాబు ఛాలెంజ్‌ విసిరారు. (యూవీ క్యాంప్‌లోనే సుజీత్‌.. తదుపరి చిత్రాన్ని ఫిక్స్ చేసుకున్న సాహో దర్శకుడు.. త్వరలోనే అధికారిక ప్రకటన)