కంగన సిస్టర్స్ కు ముంబై కోర్ఠులో షాక్.. పోలీసు సమన్లను గౌరవించకపోవడంపై సీరియస్.. జనవరి 8న పోలీసుల ముందుకు రావాలని ఆదేశాలు

దేశద్రోహం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి కంగన రనౌత్, ఆమె సోదరి రంగోలి చంచెల్‌లకు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగలింది.

కంగన సిస్టర్స్ కు ముంబై కోర్ఠులో షాక్..  పోలీసు సమన్లను గౌరవించకపోవడంపై సీరియస్.. జనవరి 8న పోలీసుల ముందుకు రావాలని ఆదేశాలు
Follow us
Balaraju Goud

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 24, 2020 | 8:11 PM

దేశద్రోహం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి కంగన రనౌత్, ఆమె సోదరి రంగోలి చంచెల్‌లకు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. ఈ కేసులో వారిద్దరిని జనవరి 8న ముంబై పోలీసుల ఎదుట హాజరు కావాలని కోర్టు వారిని ఆదేశించింది. విచారణ నిమిత్తం పలుమార్లు పోలీసుల ముందు హాజరు కావాలని సూచించినప్పటికీ రాకపోవడంతో ఈ మేరకు బాంబే హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై కంగన సిస్టర్స్‌పై కేసు నమోదైంది. అయితే, బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల తర్వాత ఎఫ్ఐఆర్‌ను తిరిగి మార్చారు. అలాగే, రనౌత్, ఆమె సోదరిపై విచారణ జరపాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.

తమపై నమోదైన ఎఫ్ఐఆర్‌తోపాటు, మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ కంగన, ఆమె సోదరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కర్ణిక్‌లతో కూడి డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసులు పంపిన సమన్లను గౌరవించనందుకు కంగన సిస్టర్స్‌ను న్యాయస్థానం మందలించింది. అలాగే, కోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 8న మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య ముంబై పోలీసుల ఎదుట కంగన సిస్టర్స్ హాజరవుతారని వారి తరపు న్యాయవాది రిజ్వాన్ సిద్దిఖి కోర్టుకు హామీ ఇచ్చారు. ఆ అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. ఈ విషయం సుదీర్ఘంగా వినే వరకు మధ్యంతర రక్షణ మంజూరు చేయాల్సిన అవసరం ఉందని తాము ప్రాథమికంగా అభిప్రాయపడినట్టు ధర్మాసనం పేర్కొంది. కాబట్టి పోలీసులు అరెస్ట్ సహా ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని ఆదేశించింది.