వాసివాడి తస్సాదియ్యా..! బంగార్రాజు బ్యూటీ అందాల బీభత్సం.. చూస్తే పడిపోవాల్సిందే
బంగార్రాజు సినిమా 2016లో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున , నాగ చైతన్య కలిసి నటించిన ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్య జోడీగా కృతి శెట్టి నటించి అకట్తుకున్నారు. 14 జనవరి 2022న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది
అక్కినేని హీరోలు ప్రస్తుతం భారీ హిట్ కోసం ప్రయతినిస్తున్నారు. కింగ్ నాగార్జున ధనుష్ కుబేరా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే నాగ చైతన్య కూడా తన సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తండేల్ అనే సినిమా షూటింగ్ లో ఉన్నాడు చైతూ.. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతుంది. కాగా కింగ్ నాగార్జున, నాగ చైతన్యలు కలిసి నటించిన చిత్రం బంగార్రాజు. కరోనా సమయంలోనూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుందీ సినిమా.
ఇది కూడా చదవండి : 8th క్లాస్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తే.. ఎండ్ అయ్యేసరికి ఇంటర్ అయిపొయింది.. ఆర్ఆర్ఆర్ మల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
నాగార్జున నమ్మకాన్ని వమ్ముకాకుండా భారీ విజయాన్ని అందుకుందీ చిత్రం. అందుకుంది వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా రమ్మకృష్ణ నటించగా, చైతన్య సరసన కృతీ శెట్టి నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌కు మంచి మార్కులు పడ్డాయి. అలాగే ఈ సినిమాలో చాలా మంది నటించారు. ఈ మూవీలో నటించిన ఓ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి : కోయ్.. కోయ్.. కేక పెట్టించిందిరోయ్..! దృశ్యం సినిమాలో వెంకీ చిన్న కూతురు గత్తర లేపిందిగా..!
పై ఫొటోలో ఉన్న చిన్నదాన్ని గుర్తుపట్టారా.? బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య స్టార్టింగ్ లో ఈ అమ్మడితోనే పులిహోర కలుపుతాడు. ఇంత అందంగా ఉంటే దిష్టి తగులుతుంది అని అమ్మాయిని పడేస్తాడు. ఆ చిన్నది ఇప్పుడు హీరోయిన్స్ ను మించే అందంగా మారిపోయింది. బంగార్రాజు సినిమాలో క్యూట్ గా కనిపించిన ఆమె ఇప్పుడు క్యూట్ నెస్ తో పాటు కేక పెట్టించే అందంతో అదరగొడుతుంది. ఆమె పేరు యష్ణ. ఈ చిన్నది సినిమాలతో పాటు పలు యాడ్స్ లోనూ నటించింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గాను చేసింది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను కవ్విస్తుంది ఈ కుర్రది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .