Tollywood: రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.? అందాలతో గత్తరలేపుతోందిగా

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నది గుర్తొచ్చిందా.? రణ్‌బీర్ కపూర్‌తో ఫోటో దిగిన ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. మన తెలుగు అమ్మాయి కూడా.. త్వరలోనే చిరంజీవితో 'విశ్వంభర' చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. మరి ఆమె ఎవరో తెల్సా..

Tollywood: రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.? అందాలతో గత్తరలేపుతోందిగా
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 15, 2025 | 10:21 AM

అప్పుడు బాలనటులుగా సిల్వర్ స్క్రీన్‌పై ఓ వెలుగు వెలిగిన నటీనటులు ఎందరో ఇప్పుడు హీరోలు, హీరోయిన్లుగా మారిపోయి.. వరుసగా సినిమాలు చేస్తున్నారు. తేజ సజ్జా, కావ్య కళ్యాణ్ రామ్, ఆకాష్ పూరి, బాంధవి శ్రీధర్, ప్రీతీ అన్సారి, గౌరీ కిషన్.. ఇలా చెప్పుకుంటూపోతే చాలామంది ఉన్నారు. ఇక ఆ కోవకు చెందిన చిన్నదాని గురించి ఇప్పుడు తెలుసుకుందామా.. పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారిని గుర్తుపట్టారా.? రణ్‌బీర్ కపూర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో ఫోటోలు దిగిన ఈ చిన్నది.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై క్రేజీ హీరోయిన్.. మరి ఆమెవరో ఇప్పుడు గుర్తుపట్టారా.? మన తెలుగు అమ్మాయి కూడా..

ఆమె మరెవరో కాదు రమ్య పసుపులేటి. 2018లో ‘హుషారు’ అనే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’, ‘మెయిల్స్ ఆఫ్ లవ్’, ‘కమిట్‌మెంట్’ లాంటి చిత్రాలతో తన నటనకుగానూ మంచి మార్కులు దక్కించుకుంది. ఇక గతేడాది రిలీజైన ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ మూవీతో రమ్య పసుపులేటికి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈమె త్వరలోనే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే ‘చదరంగం’, ‘బీఎఫ్ఎఫ్’ వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది రమ్య పసుపులేటి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రమ్య.. ఎప్పుడూ గ్లామర్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వకుండా చేస్తోంది. లేట్ ఎందుకు మీరూ ఆ ఇన్‌స్టా ఫోటోలపై ఓ లుక్కేయండి

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి