రూటు మార్చిన డైరెక్టర్ శంకర్.. రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్‌కు ఛాన్స్ ?
సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించి టాప్ డైరెక్టర్‌గా చెలామణి అవుతున్నాడు శంకర్. అయితే ఇన్ని హిట్ సినిమాలను రూపొందించిన శంకర్
Ram Charan & Shankar Movie Update: సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించి టాప్ డైరెక్టర్‌గా చెలామణి అవుతున్నాడు శంకర్. అయితే ఇన్ని హిట్ సినిమాలను రూపొందించిన శంకర్ ఇప్పటివరకు ఒక్క తెలుగు హీరోతో కూడా మూవీ తీయలేదు. తాజాగా శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ఓ సినిమా తీయబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాను నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ ప్రధాన పాత్రలో భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తైన తర్వాత చరణ్, శంకర్ కాంబో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అలాగే కొరటాల శివ, చిరంజీవి కాంబోలో తెరకెక్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.
తాజాగా చరణ్, శంకర్ కాంబోలో రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుకు సంబంధించిన ఓ గాసిప్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. అదెంటంటే.. శంకర్ తీసే సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో.. అందులోని సాంగ్స్ కూడా అదే రేంజ్లో హిట్ అవుతాయి. దాదాపు ఆయన సినిమాలన్నింటికి ఆయన సన్నిహుతుడు ఏ.ఆర్ రెహమాన్ కానీ హ్యారిస్ జైరాజ్ కానీ సంగీతాన్ని అందిస్తుంటారు. తాజా సమాచారం ప్రకారం శంకర్ ఈసారి వీరిద్ధరిని కాదని.. మరో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అతనేవరో కాదు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌ను ఈ సినిమా కోసం సెలక్ట్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈ వార్త సంబంధించి ఎలాంటి అఫిషియల్ అప్ డేట్ రాలేదు. మరీ నిజంగానే శంకర్.. ఈసారి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇవ్వనున్నాడా ? లేదా ? అనేది చూడాలి.
Also Read: ఆచార్య కోసం ఆరాటపడుతున్న డైరెక్టర్ కొరటాల శివ .. చిరంజీవి కోసం కోట్లు ఖర్చుపెట్టి మరీ..