AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varma Goa Shifts: రాం గోపాల్ వర్మ గోవాకు మకాం మార్చాడా? హైదరాబాద్‌ను వదలడానికి కారణం ఏంటి..

Varma Goa Shifts: వివాదాల దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. తనదైన శైలిలో సినిమాలు నిర్మిస్తూ రిలీజ్ చేస్తూ వెళుతుంటాడు. గతేడాది కరోనా

Varma Goa Shifts: రాం గోపాల్ వర్మ గోవాకు మకాం మార్చాడా? హైదరాబాద్‌ను వదలడానికి కారణం ఏంటి..
uppula Raju
|

Updated on: Jan 04, 2021 | 9:55 PM

Share

Varma Goa Shifts: వివాదాల దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. తనదైన శైలిలో సినిమాలు నిర్మిస్తూ రిలీజ్ చేస్తూ వెళుతుంటాడు. గతేడాది కరోనా వల్ల చిత్ర పరిశ్రమ తీవ్ర నష్టాల్లో మునిగిపోయింది. నటీనటులందరు ఇళ్లలోనే ఉండిపోయారు కానీ వర్మ మాత్రం బిజీగా సినిమాలు నిర్మించారు. కరోనా, లాక్‌డౌన్ పక్కనబెట్టి వరుసగా సినిమాలు చేసి ఓటీటీలో రిలీజ్ చేశాడు. అందరిది ఒక దారైతే తనది ప్రత్యేక దారని నిరూపించాడు. అయితే తాజాగా వర్మ గురించి ఓ కబురు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. వ‌ర్మ త‌న టీంతో క‌లిసి గోవాకు మ‌కాం మార్చేశాడ‌న్న వార్త ఇపుడు హల్‌చల్ చేస్తోంది.

వ‌ర్మ ప్రధానంగా ముంబైతోపాటు హైద‌రాబాద్‌లే కేంద్రంగా సినిమాలు రూపొందిస్తున్నాడు. అయితే కొన్ని సంవత్సరాలుగా హైద‌రాబాద్‌లోనే సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం త‌న అభిరుచుల‌కు తగ్గట్టుగా సినిమా చేయ‌డానికి గోవా ఫ‌ర్ ఫెక్ట్ గా షూట్ అవుతుంద‌ని ఫిక్సయ్యాడ‌ట‌. గోవా నుంచి ప్రధానంగా హిందీ కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేయాల‌నుకుంటున్నాడని టాక్‌. ప‌లువురు టాలీవుడ్ దర్శక నిర్మాత‌లు, న‌టులు ఇప్పటికే గోవాలో లీజ్ పద్దతిలో విల్లాలు తీసుకుంటున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం వర్మ హిందీలో 12 ‘O’ Clock హార్రర్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

మరిన్ని చదవండి:

గుంటూరులో గోవా లిక్కర్.. ధరలు తగ్గినా ఆగని స్మగ్లింగ్.. లారీ సీజ్, ఇద్దరి అరెస్టు

గోవాలో ‘క్రాక్’టీమ్ .. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మాస్ రాజా-శ్రుతిహాసన్ ఫోటోలు