కరోనా నిబంధనల ఉల్లంఘన.. చిక్కుల్లో సల్మాన్ ఫ్యామిలీ.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసులు..
Violation Of Covid Rules: ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్‌లోకి రాకపోగా.. మరోవైపు దేశంలోని 'స్ట్రెయిన్' కేసుల ఎఫెక్ట్ ఆందోళనకు..

Violation Of Covid Rules: ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్‌లోకి రాకపోగా.. మరోవైపు దేశంలోని ‘స్ట్రెయిన్’ కేసుల ఎఫెక్ట్ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. విదేశీ ప్రయాణీకులకు స్ట్రిక్ట్ క్వారంటైన్ రూల్స్ అమలు చేస్తున్నాయి. అయితే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తమ్ముళ్లు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్‌లు మాత్రం అవేమి పట్టించుకోకుండా మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారు.
డిసెంబర్ 25న యూఏఈ నుంచి సల్మాన్ ఖాన్ తమ్ముళ్లు సోహైల్ ఖాన్ అర్బాజ్ ఖాన్, అతడి కొడుకు నిర్వన్ ఖాన్ ముంబై చేరుకున్నారు. వీరు కరోనా నిబంధనల ప్రకారం తాజ్ ల్యాండ్స్‌లో క్వారంటైన్‌లో ఉండాలి.. అయితే అలా కాకుండా వారు కోవిడ్ రూల్స్‌ను ఉల్లంఘించి బాంద్రాలోని తమ నివాసానికి వెళ్లిపోయారు. దీనితో వీరిపై ముంబైలోని ఖర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది.
Also Read: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. రామతీర్ధం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశం..
