Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vyooham: వ్యూహం సినిమా విడుదలపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్‌..

దీంతో ఈ సినిమాపై సహజంగానే అటు సినీ ప్రేక్షకులతో పాటు, రాజకీయ నాయకుల్లోనూ క్యూరియాసిటీని పెంచేసింది. ఇదిలా ఉంటే వివాదాలకు పెట్టింది పేరైన వర్మ.. కొత్త చిత్రం కూడా వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి. దీంతో ఈ సినిమా చుట్టూ రాజకీయాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయనున్నట్లు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రకటించారు...

Vyooham: వ్యూహం సినిమా విడుదలపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్‌..
Vyooham Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 19, 2023 | 2:35 PM

సంచలన దర్శకుడు తెరకెక్కించిన తాజా చిత్రం ‘వ్యూహం’. ఆంధప్రప్రదేశ్‌ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా విడుదలకు ముందే సంచనాలు సృష్టించిన విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత మొదలుకొని జగన్ మోహన్‌ రెడ్డి ఓదార్పు యాత్ర, అనంతరం ముఖ్యమంత్రి వరకు జరిగిన పరిణామాలు ఈ సినిమాలో చూపించనున్నారు.

దీంతో ఈ సినిమాపై సహజంగానే అటు సినీ ప్రేక్షకులతో పాటు, రాజకీయ నాయకుల్లోనూ క్యూరియాసిటీని పెంచేసింది. ఇదిలా ఉంటే వివాదాలకు పెట్టింది పేరైన వర్మ.. కొత్త చిత్రం కూడా వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి. దీంతో ఈ సినిమా చుట్టూ రాజకీయాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయనున్నట్లు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రకటించారు.

ఇక అంతకు ముందు ప్రకటించినట్లు ఈ సినిమాను నవంబర్‌ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. తదనంతర పరిస్థితులు, సెన్సార్‌ బోర్డ్‌ అభ్యంతరాల నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. వ్యూహం సినిమాలో తమను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ టీడీపీ నాయకుడు లోకేష్‌ సెన్సార్‌ బోర్డుకు లేఖ రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రివైజింగ్ కమిటీ సినిమా చూసిన తరవాత కొత్త విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తామని ఆర్జీవీ గతంలోనే చెప్పారు. అయితే ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డ్ అనుమతి ఇస్తుందా లేదా అన్న అనుమానాలు ఉన్న తరుణంలో దర్శకుడు రామ్‌గోపాలవ్‌ వర్మ తాజాగా చేసిన ఓ ట్వీట్‌ ఆసక్తిని పెంచేసింది. వ్యూహం సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదలకాబోతోంది అని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఓ పోస్టర్‌ను ట్విట్టర్‌లో విడుదల చేశారు.

ఆర్జీవీ ట్వీట్..

వ్యూహం సినిమా నేరుగా ఓటీటీలో విడుదలవుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నింటిన పటాపంచలు చేస్తూ.. వర్మ ట్వీట్ చేశార. దీంతో త్వరలోనే ఈ సినిమా థియేటర్లకు రానుందని వర్మ క్లారిటీ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే సెన్సార్‌ బోర్డ్‌ వ్యూహం విడుదలకు నిరాకరణ తెలిపిన విషయంపై వర్మం గతంలో స్పందిస్తూ.. ‘ఉడ్తా పంజాబ్, పద్మావత్‌’ వంటి హిందీ సినిమాలకు కోర్టు ద్వారా రిలీజ్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నట్లే తామూ తెచ్చుకుంటామని.. చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా వ్యూహం చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపిన విషయం విధితమే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..