త్వరలో రాజమౌళితో: మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం మే 9న విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మీడియాతో ముచ్చటించారు. ఇందులో ‘మహర్షి’ సినిమాతో పాటు మరికొన్ని విషయాలను ఆయన షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళితో సినిమా ఎప్పుడు అని మీడియా అడిగిన ప్రశ్నకు అతి త్వరలోనే అంటూ ఆయన సమాధానమిచ్చారు. మహేష్ బాబు […]

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం మే 9న విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మీడియాతో ముచ్చటించారు. ఇందులో ‘మహర్షి’ సినిమాతో పాటు మరికొన్ని విషయాలను ఆయన షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళితో సినిమా ఎప్పుడు అని మీడియా అడిగిన ప్రశ్నకు అతి త్వరలోనే అంటూ ఆయన సమాధానమిచ్చారు. మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘రాజమౌళి గారితో త్వరలోనే చిత్రం ఉంటుంది. చర్చలు జరుగుతున్నాయి. త్వరలో నేనే అన్ని వివరాలు తెలియజేస్తాను’’ అని తెలిపారు. అన్నీ కుదిరితే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి చేయబోయే చిత్రం బహుశా మహేష్‌తోనే ఉంటుందని అంతా అనుకుంటున్నారు.



