Vijay Devarakonda: లైగర్ కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్.. పోస్టర్‌లో సీక్రెట్ హింట్ ఇచ్చిన పూరీ జగన్నాథ్..
Vijay Devarakonda: కొన్ని కాంబినేషన్స్ అలా సెట్ అయిపోతాయి. హీరో, దర్శకుల మధ్య ఉన్న స్నేహ బంధం వారి కాంబినేషన్‌లో మరికొన్ని సినిమాలు రావడానికి కారణమవుతుంటాయి. ఇలా టాలీవుడ్‌లో హీరోలను రిపీట్ చేసే వారిలో పూరీ జగన్నాథ్ (puri jagannadh) ముందు వరుసలో ఉంటారు...
Vijay Devarakonda: కొన్ని కాంబినేషన్స్ అలా సెట్ అయిపోతాయి. హీరో, దర్శకుల మధ్య ఉన్న స్నేహ బంధం వారి కాంబినేషన్‌లో మరికొన్ని సినిమాలు రావడానికి కారణమవుతుంటాయి. ఇలా టాలీవుడ్‌లో హీరోలను రిపీట్ చేసే వారిలో పూరీ జగన్నాథ్ (puri jagannadh) ముందు వరుసలో ఉంటారు. పూరి ఇప్పటికే పలుసార్లు మహేష్ బాబు (Mahesh Babu), ఎన్టీఆర్ (NTR), రవితేజ (Ravi Teja) వంటి స్టార్ హీరోలను రిపీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జాబితాలోకి యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా వచ్చి చేరారు. విజయ్-పూరీ కాంబినేషన్‌లో ప్రస్తుతం ‘లైగర్’ (Liger) సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా ప్రేక్షకులకు ముందకు రాకముందే వీరి కాంబినేషన్‌లో మరో సినిమా పట్టాలెక్కనుంది.
గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ పూరీ జగన్నాథ్ విజయ్‌తో మరో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ విషయమై ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. 29-03-2022 అంటే రేపు మధ్యాహ్నం 02:20 గంటలకు కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేయనున్నారు. ‘నెక్ట్స్ మిషన్ లాంచ్’ చేయనున్నామని పూరీ తెలిపారు.
దీంతో ఈ పాటు పూరీ విడుదల చేసిన పోస్టర్‌లో ఇచ్చిన ‘19.0760 N, 72.877 e’ అక్షంశ రేఖాంశల ఆధారంగా కొత్త సినిమా అప్‌డేట్‌ను ముంబయిలో విడుదల చేయనున్నట్లు పూరీ హింట్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనున్నట్లు అర్థమవుతోంది. ఇంతకీ ఈ సినిమా పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘జనగణమనే’నా.? మరోటా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
— Vijay Deverakonda (@TheDeverakonda) March 28, 2022
Also Read: Beauty Tips: అవిసెగింజలతో అందానికి మెరుగులు.. ఇలా చేసి చూడండి..!
Yadadri: వైభవంగా ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శోభాయాత్ర..
TSRTC: ప్రయాణికుల నడ్డి విరుస్తోన్న ఆర్టీసీ.. సెస్ పేరుతో మరో సారి వడ్డన