Krishna Vrinda Vihari : రొమాంటిక్ ఎంటటైనర్‌గా నాగశౌర్య మూవీ.. ఆకట్టుకుంటున్న కృష్ణ వ్రింద విహారి టీజర్
టాలీవుడ్ లో కుర్ర హీరోల హవా నడుస్తుంది.. సినిమాకు హిట్ అయినా ఫట్ అయినా పాటించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు.
Krishna Vrinda Vihari : టాలీవుడ్ లో కుర్ర హీరోల హవా నడుస్తుంది.. సినిమాకు హిట్ అయినా ఫట్ అయినా పాటించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. కేవలం ఒక జోనర్ కే ఫిక్స్ అవ్వకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. కొత్త కథలతో సినిమాలు చేస్తున్న యంగ్ హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు నాగశౌర్య. ఇటీవల లక్ష్య , వరుడు కావలెను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శౌర్య.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. కృష్ణ వ్రింద విహారి అనే ఆసక్తికర టైటిల్ తో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ చిత్రానికి అనీష్ ఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో షెర్లీ సెటియా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమానుంచి వచ్చిన పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమానుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్..
కృష్ణ వ్రింద విహారి టీజర్ ను సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. నాగ శౌర్య తొలిసారిగా బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నాడు. షెర్లీ సెటియా తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఈ సినిమా ఓ రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. గత సినిమాలలో పాత్రలకు భిన్నంగా, వినోదభరితమైన పాత్రలో కనిపించనున్నాడు నాగశౌర్య. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇందులో స్టార్ కమెడియన్లు వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య నటించడం వల్ల ఈ సినిమా హాస్యభరితంగా ఉంటుందని అర్థం అవుతోంది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :