ఆ సినిమా విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన టాప్ డైరెక్టర్.. అసలు కారణం ఎంటంటే..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ రెబల్ స్టార్ అభిమానులకు క్షమమణలు చెప్పారు. అసలు విషయం
ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ రెబల్ స్టార్ అభిమానులకు క్షమమణలు చెప్పారు. అసలు విషయం ఎంటంటే.. ప్రభాస్, మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే హీరోయిన్గా నటించనుండగా… బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ అప్ డేట్ గురించి ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు.
సంక్రాంతి రోజున స్పెషల్ అప్ డేట్ రాబోతుందని ముందుగా నాగ్ అశ్విన్ చెప్పగా.. ఆ సమయానికి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో అప్ డేట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని వరుస ట్వీట్లు చేశారు. దీంతో నాగ్ అశ్విన్ స్పంధిస్తూ.. జనవరి 29న మరియు ఫిబ్రవరి 26న రెండు అప్ డేట్స్ రాబోతున్నాయని రిప్లై ఇచ్చాడు. ఈ వార్తతో అభిమానులు సంతోషంగా ఫీల్ అవుతూ.. ఫిబ్రవరి 26న వచ్చే అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకో పదిరోజుల్లో నాగ్ అశ్విన్, ప్రభాస్ సినిమా అప్ డేట్ రాబోతుందని ఓ అభిమాని పెట్టిన ట్వీట్‌కు నాగ్ అశ్విన్ స్పందించాడు. “తనను క్షమించాలని.. ఈ 26న ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేమని.. అది సరైన సమయం కాదంటూ” రిప్లై ఇచ్చాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈ సినిమాను అశ్వనీదత్ రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తు్న్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ మూవీ చేస్తున్నాడు. ఇదే కాకుండా ఓంరౌత్ దర్శకత్వంలో అదిపురుష్ సినిమాను కూడా చేస్తున్నాడు. మరోవైపు ప్రభాస్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రాధేశ్యామ్ షూటింగ్ చివరిదశలో ఉంది.
Only 10 Days Left For #PrabhasNagAshwin Movie Update ??
Expecting Something BIG Update This Time ?? – FEB 26 ⚡#Prabhas ❤️ @nagashwin7 ? @VyjayanthiFilms
— Prabhas ❤️ (@RakeShPrabhas20) February 15, 2021
Also Read:
బాహుబలిని మించిన ‘ఆర్ఆర్ఆర్’.. తమిళనాట రికార్డ్ క్రియేట్ చేస్తున్న జక్కన్న సినిమా..