బాలీవుడ్ బడాహీరోతో గొడవ పై క్లారిటీ ఇచ్చిన మక్కల్ సెల్వన్.. అందుకే సినిమానుంచి తప్పుకున్నారట..

తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం ఇటు టాలీవుడ్ లో అటు కోలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.  ఇటీవల ఉప్పెన సినిమాతో మరిసారి తన నటనతో ఆకట్టుకున్న..

  • Rajeev Rayala
  • Publish Date - 3:32 pm, Wed, 17 February 21
బాలీవుడ్ బడాహీరోతో గొడవ పై క్లారిటీ ఇచ్చిన మక్కల్ సెల్వన్.. అందుకే సినిమానుంచి తప్పుకున్నారట..

Vijay Sethupathi : తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం ఇటు టాలీవుడ్ లో అటు కోలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.  ఇటీవల ఉప్పెన సినిమాతో మరిసారి తన నటనతో ఆకట్టుకున్న సేతుపతికి టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుతున్నాయని తెలుస్తుంది. అదే విధంగా ఈ వర్సటైల్ యాక్టర్ కోసం బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలు ఛాన్స్ దక్కించినుకున్నారు మక్కల్ సెల్వన్.

అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కరీనా కపూర్ కనిపించనుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకున్నారు. ఆ తర్వాత అనుకోని కొన్ని కారణాల వల్ల ఈ మూవీ నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే అమీర్ ఖాన్ సినిమాకోసం విజయ్ సేతుపతిని లావు తగ్గాలని కోరారని ఆ విషయాన్నీ సేతుపతి సీరియస్ గా తీసుకోలేదని ఆ విషయం పై గొడవలు జరిగాయని సోషల్ మీడియాలో కథలు కథలుగా చర్చలు జరిగాయి. తాజాగా ఈ వార్తల్లో వాస్తవం లేదని క్లారిటీ వచ్చింది. విజయ్ సేతుపతి మాట్లాడుతూ… ఈ ప్రాజెక్టు నుంచి నన్ను తప్పించారనే వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. అంతే కాదు నేను కూడా ఈ ప్రాజెక్టు నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పుకోలేదు. కేవలం నా డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్లే ఈ సినిమా చేయలేక పోతున్న అంటూ మక్కల్ సెల్వన్ క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

నిర్మాతగా మారుతున్న మాస్ మాహారాజా.. కొత్త బ్యానర్‌ను రిజిస్టర్ చేయిస్తున్న రవితేజ.. పేరేంటో తెలుసా..