తెలుగులో ‘పొగరు’తో ఎంట్రీ ఇవ్వనున్న ధృవ సర్జా.. విడుదల తేదీని ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..

కరాబు మైండు కరాబు.. మెరిసే కరాబు.. అంటూ తెలుగులో సెన్సెషన్ క్రియేట్ చేసింది 'పొగరు' మూవీ సాంగ్. ఈ సినిమాలో కన్నడ

  • Rajitha Chanti
  • Publish Date - 10:04 pm, Wed, 20 January 21
తెలుగులో 'పొగరు'తో ఎంట్రీ ఇవ్వనున్న ధృవ సర్జా.. విడుదల తేదీని ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..

కరాబు మైండు కరాబు.. మెరిసే కరాబు.. అంటూ తెలుగులో సెన్సెషన్ క్రియేట్ చేసింది ‘పొగరు’ మూవీ సాంగ్. ఈ సినిమాలో కన్నడ స్టార్ ధృవ సర్జా, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తెలుగులో కూడా అదే పేరుతో విడుదల కానుంది. ఇక తెలుగు రీమేక్ హక్కులను 3 కోట్లకు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్, ప్రొడ్యూసర్ డి.ప్రతాప్ రాజు సొంతం చేసుకున్నారని టాక్. అయితే తెలుగులో ఈ సినిమాను సాయిసూర్య ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 19న తెలుగులో ఈ సినిమా రీలిజ్ చేయనుందనట చిత్రయూనిట్. అటు తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారట.