AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నో గ్యాప్.. రూమర్లకు చెక్ పెట్టిన రాక్‌స్టార్

రాక్‌స్టార్ అలియాస్ డీఎస్పీ అలియాస్ దేవీ శ్రీ ప్రసాద్.. టాలీవుడ్‌లో ఈ పేరుకో ఓ బ్రాండ్ ఉంది. ఏదైనా సినిమా పోస్టర్‌పై ఆయన పేరు కనిపిస్తే చాలు సినిమా సగం హిట్టేనని అందరూ నమ్మేవారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సంగీత దర్శకుడిపై విమర్శలు వస్తున్నాయి. తన మ్యూజిక్‌ను తానే రిపీట్ చేస్తున్నాడని కామెంట్లు వినిపించాయి. దాంతో ఆయనతో తరచుగా పనిచేసే దర్శకులు సైతం డీఎస్పీని పక్కన పెట్టినట్లు టాక్ నడిచింది. ఆ లిస్ట్‌లో కొరటాల […]

నో గ్యాప్.. రూమర్లకు చెక్ పెట్టిన రాక్‌స్టార్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 15, 2020 | 10:48 PM

Share

రాక్‌స్టార్ అలియాస్ డీఎస్పీ అలియాస్ దేవీ శ్రీ ప్రసాద్.. టాలీవుడ్‌లో ఈ పేరుకో ఓ బ్రాండ్ ఉంది. ఏదైనా సినిమా పోస్టర్‌పై ఆయన పేరు కనిపిస్తే చాలు సినిమా సగం హిట్టేనని అందరూ నమ్మేవారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సంగీత దర్శకుడిపై విమర్శలు వస్తున్నాయి. తన మ్యూజిక్‌ను తానే రిపీట్ చేస్తున్నాడని కామెంట్లు వినిపించాయి. దాంతో ఆయనతో తరచుగా పనిచేసే దర్శకులు సైతం డీఎస్పీని పక్కన పెట్టినట్లు టాక్ నడిచింది. ఆ లిస్ట్‌లో కొరటాల శివ ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

మిర్చితో దర్శకుడిగా మారిన కొరటాల ఇప్పటి వరకు నాలుగు చిత్రాలు తెరకెక్కించగా.. వాటన్నింటికి దేవీనే సంగీతం అందించారు. ఆ సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంలో డీఎస్పీ కీలక పాత్ర పోషించారు. అయితే మెగాస్టార్‌తో తాను తెరకెక్కిస్తోన్న ఐదవ చిత్రానికి సంగీత దర్శకుడిగా మణిశర్మను తీసుకున్నారు కొరటాల. దీంతో కొరటాల కూడా రాక్‌స్టార్‌ని పక్కనపెట్టారని వార్తలు వచ్చాయి. దానికి తోడు తనకు సన్నిహితంగా ఉండే ప్రతి ఒక్కరి పుట్టినరోజుకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పే రాక్‌స్టార్.. గతేడాది కొరటాల విషెస్ చేయలేదు. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్లు రూమర్లు వచ్చాయి. అయితే వాటన్నింటికి తాజాగా చెక్ పెట్టేశారు దేవీ. హ్యాపీ బర్త్‌డే సారు వారు అంటూ కొరటాలను తాను ఎప్పుడూ పిలిచే విధంగా విష్ చేశారు. దీంతో వారిద్దరి మధ్య గ్యాప్ ఉంది అన్న వార్తలకు చెక్ పెట్టినట్లైంది. మరి ఈ ఇద్దరు భవిష్యత్‌లో మళ్లీ కలిసి పనిచేస్తారా..? దేవీ తిరిగి తన సత్తాను చాటుకుంటారా..? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Read This Story Also: దిగ్విజయ్‌ సింగ్‌పై కేసు నమోదు

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు
చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు
మురుగు కాలువను క్లీన్ చేస్తున్న కార్మికులు.. కాళ్ల కింద కనిపించిన
మురుగు కాలువను క్లీన్ చేస్తున్న కార్మికులు.. కాళ్ల కింద కనిపించిన
క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను ఎలా రీడీమ్ చేసుకోవాలి?
క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను ఎలా రీడీమ్ చేసుకోవాలి?
ఆర్థిక ఇబ్బందులను దూదిలా ఊదేయండి.. ఈజీ టిప్స్
ఆర్థిక ఇబ్బందులను దూదిలా ఊదేయండి.. ఈజీ టిప్స్
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌... మెగాస్టార్‌కి ఊరట!
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌... మెగాస్టార్‌కి ఊరట!
వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు..
వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు..
హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత
హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత
ప్రపంచంలోనే అత్యంత వింతైన బీచ్..వెలుగులోకి 150 ఏళ్ల నాటి మిస్టరీ!
ప్రపంచంలోనే అత్యంత వింతైన బీచ్..వెలుగులోకి 150 ఏళ్ల నాటి మిస్టరీ!