షారూక్-అట్లీ మూవీ.. హీరోయిన్‌గా కింగ్‌ఖాన్ లక్కీ గర్ల్!
షారూక్ ఖాన్‌తో అట్లీ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ,
Shah Rukh Khan- Atlee movie: షారూక్ ఖాన్‌తో అట్లీ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీని తన సొంత నిర్మాణసంస్థలో షారూక్‌నే నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ క్రేజీ చిత్రానికి సంకి అనే టైటిల్‌ని అనుకుంటుండగా.. ఇందులో హీరోయిన్‌గా దీపికా పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. షారూక్ అంటే ప్రత్యేక అభిమానం కలిగిన దీపికా, ఈ మూవీకి ఓకే చెప్పే అవకాశాలు ఉన్నట్లు టాక్.
కాగా బాలీవుడ్‌లోకి దీపికా ఓం శాంతి ఓం చిత్రం ద్వారా దర్శనమిచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో పాటు దీపికాకు మంచి పేరును తీసుకొచ్చింది. ఇక ఆ తరువాత షారూక్, దీపికా.. చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాల్లో కలిసి నటించారు. ఈ మూడు సినిమాలు మంచి విజయాలను సాధించగా.. వీరిద్దరు లక్కీ పెయిర్‌గా మారిపోయారు. ఒకవేళ ఇదే నిజమైతే ఆరు సంవత్సరాల తరువాత హిట్ పెయిర్ మళ్లీ కలిసి నటించనున్నారు.
Read More:
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. రాష్ట్రాలకు కొత్తమార్గదర్శకాలు
కోలుకున్నా ఈ జాగ్రత్తలు పాటించండి: కేంద్ర ఆరోగ్య శాఖ తాజా ప్రొటోకాల్