బిగ్ బాస్ 4: ఈ వారం సూర్య కిరణ్ ఎలిమినేషన్ పక్కానా.!

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 4లో అసలు మజా ఇంకా మొదలు కాలేదు. తొలివారం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తూ సోసోగానే గడిచింది.

బిగ్ బాస్ 4: ఈ వారం సూర్య కిరణ్ ఎలిమినేషన్ పక్కానా.!
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 13, 2020 | 10:29 AM

Bigg Boss 4: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 4లో అసలు మజా ఇంకా మొదలు కాలేదు. తొలివారం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తూ సోసోగానే గడిచింది. మొదటి రెండు రోజులు ఏడుపులు, పెడబొబ్బలుతో.. ఆ తర్వాత ఫిజికల్ టాస్క్, కట్టప్ప ఎవరు అనే క్యూరియాసిటీ లాంటి వాటితో చూస్తుండగానే వారం గడిచింది. హౌస్ నుంచి తొలి ఎలిమినేషన్ ఎవరనేది ఇవాళ తేలిపోనుంది. ఇది ఇలా ఉండగా మొదటి వారంలో డైరెక్టర్ సూర్య కిరణ్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఖచ్చితంగా ఎలిమినేట్ అయినట్లు అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Also Read: పేద విద్యార్థుల పాలిట దేవుడిగా మారిన సోనూసూద్…

ఇకపోతే తొలివారంలో గంగవ్వ, అభిజిత్, జోరుదార్ సుజాత, దివి, సూర్య కిరణ్, మెహబూబ్, అఖిల్ సార్దిక్‌లు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారని తెలిసిన విషయమే. ఇందులో గంగవ్వ, అభిజిత్, జోరుదార్ సుజాత సేఫ్ జోన్‌లో ఉండగా.. మిగిలిన నలుగురిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరో నాగార్జున ఇవాళ వెల్లడించనున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం దివి, మెహబూబ్ సేఫ్ అయ్యారని తెలుస్తోంది. మిగిలిన ఇద్దరిలో అఖిల్‌కు ఎక్కువ ఓట్లు పడగా.. సూర్య కిరణ్ చివరి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో సూర్య కిరణ్ ఎలిమినేట్ అవుతారని.. వచ్చే వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని టాక్. కాగా దీనిలో ఎంతవరకు నిజమో కొద్దిసేపట్లో తెలియనుంది.

Also Read: ”ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ సప్లై.. 8 వేల జంబో జెట్‌లు అవసరం”