అప్పుడు మీరేం చేశారు.. ఇదే సాక్ష్యం : వైఎస్ఆర్ సీపీ

ఆంధ్రప్రదేశ్ లో అంతర్వేది రథం దగ్ధం ఘటన సంచలనంగా మారిన నేపథ్యంలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య ఈ అంశం మరింత అగ్గి రాజేస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు భారీ స్థాయిలో జగన్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తుండగా, అధికారపక్ష నేతలు కూడా తమ వంతుగా కౌంటర్ అటాక్ కు దిగుతున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక వీడియోని ముందుకు తీసుకువచ్చింది. గతంలో టీడీపీ పాలనలో ఓ రథం దగ్ధమైతే ఏంచేశారంటూ […]

అప్పుడు మీరేం చేశారు.. ఇదే సాక్ష్యం : వైఎస్ఆర్ సీపీ
Follow us
Balu

|

Updated on: Sep 13, 2020 | 10:36 AM

ఆంధ్రప్రదేశ్ లో అంతర్వేది రథం దగ్ధం ఘటన సంచలనంగా మారిన నేపథ్యంలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య ఈ అంశం మరింత అగ్గి రాజేస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు భారీ స్థాయిలో జగన్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తుండగా, అధికారపక్ష నేతలు కూడా తమ వంతుగా కౌంటర్ అటాక్ కు దిగుతున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక వీడియోని ముందుకు తీసుకువచ్చింది. గతంలో టీడీపీ పాలనలో ఓ రథం దగ్ధమైతే ఏంచేశారంటూ ప్రశ్నించింది. టీడీపీ పాలనలో 2017 అక్టోబరు 19న సాయంత్రం 5 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా కె.పెంటపాడు గ్రామంలో ఉన్న శ్రీ గోపాలస్వామి ఆలయంలో రథం దగ్ధమైందని వీడియో.. వివరాలు సహా వైసీపీ బయటపెట్టింది.ఆ ఘటన జరిగిన రోజున సీసీ కెమెరాలు పనిచేయలేదని, ఘటనపై సీబీఐ విచారణ కోరలేదని, ఈవోని సస్పెండ్ చేయలేదని, కొత్త రథానికి ఒక్క రూపాయి కేటాయించలేదని వైసీపీ ట్విట్టర్ లో విమర్శించింది.