ప్రభాస్ ‘ఆదిపురుష్’ కోసం లెజండరీ సంగీత దర్శకుడు..!
రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. రామాయణం కథాంశంతో 3డీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
AR Rahman Adipurush: రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. రామాయణం కథాంశంతో 3డీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దాదాపు రూ.500కోట్లతో టీసిరిస్ నిర్మించనున్నా ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు. మిగిలిన పాత్రాధారులకు సంబంధించిన ఎంపిక ప్రస్తుతం జరుగుతోంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు తీసుకువెళ్లాలనుకుంటోన్న దర్శకనిర్మాతలు అందుకు తగ్గట్లుగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీ కోసం ఆస్కార్ అవార్డు గ్రహీత, లెజండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ని సంప్రదించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం ప్రభాస్ వర్కౌట్లను ప్రారంభించేశారని దర్శకుడు ఓమ్ రౌత్ తెలిపారు. ఈ మూవీకి సంబంధించిన ప్రతి డిస్కషన్ ఫోన్‌లో జరుగుతుందని ఆయన అన్నారు. ఈ మహమ్మారి వలన ప్రభాస్, తాను ఇంతవరకు కలవలేదని.. ఫోన్ ద్వారానే సినిమా గురించి, పాత్ర గురించి చర్చిస్తున్నామని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్‌లో నటించనున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.
Read More: