దేవరాజ్ వల్లే నా బిడ్డ ప్రాణాలు తీసుకుంది: శ్రావణి తల్లి
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు విషయంలో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. కుటుంబ సభ్యులు, సాయి కొట్టడం వలనే శ్రావణి
Sravani case updates: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు విషయంలో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. కుటుంబ సభ్యులు, సాయి కొట్టడం వలనే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు దేవరాజ్ తన దగ్గరున్న ఆడియోను పోలీసులకు అందించాడు. మరోవైపు శ్రావణి కుటుంబ సభ్యులు, సాయి ఇద్దరూ.. దేవరాజ్ బ్లాక్‌మెయిల్ చేయడం వలనే శ్రావణి ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయంపై మాట్లాడిన శ్రావణి తల్లి పాపారత్నం సైతం దేవరాజ్‌పై కామెంట్లు చేశారు. అతడి వలనే తన బిడ్డ ప్రాణాలు తీసుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దేవరాజ్ నుంచి దూరంగా ఉండాలనే సాయి, శ్రావణిని కొట్టాడని పాపారత్నం వెల్లడించారు. దేవరాజు తన మీద ఉన్న కేసును తీయించుకోవడానికే తన కుమార్తెతో ప్రేమ నాటకం ఆడాడని ఆమె ఆరోపించారు. ”శ్రావణి చనిపోయే ముందు బాత్ రూమ్ నుంచి దేవరాజ్‌కి ఫోన్ చేసింది. అప్పటికీ పెళ్లి చేసుకుంటానని దేవరాజ్ మాట ఇవ్వలేదు. సాయి లేకపోతే మా కుటుంబం ఎప్పుడో చనిపోయి ఉండేది. దేవరాజ్‌కి శ్రావణి అన్నీ తానై చూసుకుంది. మా అమ్మాయి దగ్గర డబ్బు తీసుకుని గ్లామర్ పెంచుకుని దేవరాజ్ సీరియల్ అవకాశాలు దక్కించుకున్నాడు. మమ్మల్ని నట్టేట ముంచాడు” అంటూ పాపారత్నం తెలిపారు.
Read More: