ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.. విజయ దేవరకొండ టీమ్‌ క్లారిఫికేషన్‌

విజయ్‌ దేవరకొండతో సినిమాలు చేస్తున్నామని చెప్పుకొని కొన్ని నిర్మాణ సంస్థలు అడిషన్లు నిర్వహిస్తున్న విషయాన్ని హీరో టీమ్ ఖండించింది

ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.. విజయ దేవరకొండ టీమ్‌ క్లారిఫికేషన్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 13, 2020 | 1:44 PM

Vijay Deverakonda Team: విజయ్‌ దేవరకొండతో సినిమాలు చేస్తున్నామని చెప్పుకొని కొన్ని నిర్మాణ సంస్థలు అడిషన్లు నిర్వహిస్తున్న విషయాన్ని హీరో టీమ్ ఖండించింది. అలాంటి వాటిని నమ్మకండని విజయ్ టీమ్ వెల్లడించింది. విజయ్‌కి సంబంధించిన ప్రతి సినిమాను అతడు గానీ, సినిమా నిర్మాతలు గానీ అధికారికంగా ప్రకటిస్తారని టీమ్‌ తెలిపింది. అలాగే అతడి అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడిస్తామని టీమ్ వివరించింది. విజ‌య్ దేవరకొండ పేరుతో ఎవ‌రైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే.. ఆ విష‌యాన్ని ఒక‌టికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు విజయ్ దేవరకొండ టీమ్‌కి చెందిన అనురాగ్ పర్వతనేని ఓ అధికారిక ప్రకటనను ఇచ్చారు.

అయితే సినిమా హీరో, హీరోయిన్లు, దర్శక, నిర్మాతల పేర్లతో కొంతమందికి ఫోన్లు చేసి వారిని మోసం చేసే ఘటనలు సాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. ఇక తాజాగా విజయ్ విషయంలోనూ అలాంటి ఫేక్ ప్రచారం జరుగుతుండటంతో టీమ్‌ క్లారిటీని ఇచ్చింది. కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్నారు.

Read More:

దేవరాజ్ వల్లే నా బిడ్డ ప్రాణాలు తీసుకుంది: శ్రావణి తల్లి

ప్రభాస్ ‘ఆదిపురుష్‌’ కోసం లెజండరీ సంగీత దర్శకుడు..!