సుశాంత్ కేసు.. కీలక విషయాలు వెల్లడించిన మాజీ డ్రైవర్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ ఇప్పటికే పలువురిని విచారించిన విషయం తెలిసిందే
Sushant Case updates: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ ఇప్పటికే పలువురిని విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదటగా నటుడి మాజీ డ్రైవర్ దీరేంద్రను విచారించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీరేంద్ర పలు కీలక విషయాలను వెల్లడించారు.
”కేదారినాథ్ షూటింగ్ జరిగే సమయంలో ఆయన వెంట నేను ఉన్నా. ఆ సమయంలో సుశాంత్ డ్రగ్స్ తీసుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడు డిప్రెషన్‌లో కూడా ఉండేవాడు కాదు. ఒక షెడ్యూల్ ప్రకారం సుశాంత్ నడుచుకునే వాడు. ఎప్పుడూ ఏదో ఒక పనితో బిజీగా ఉండేవాడు. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ ఆడేవాడు. ఒక్కొసారి తన కార్లను తానే నడిపేవాడు. అప్పుడు మేము అతడిని ఫాలో అయ్యే వాళ్లం. కుటుంబ సభ్యులతో సుశాంత్‌కి మంచి సంబంధాలు ఉండేవి. సుశాంత్ సోదరి ప్రియాంక, బావ తరచుగా ఇంటికి వచ్చేవారు. చిచ్చోరే షూటింగ్ సమయంలోనూ ప్రియాంక, సుశాంత్ దగ్గరే ఉంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం నమ్మలేకపోతున్నా. ఆయన జీవితాన్ని చాలా సంతోషంగా గడిపేవాడు. బలవన్మరణం చేసుకునేంత పిరికివాడు కాదని నమ్ముతున్నా” అని తెలిపారు. ఇక సుశాంత్, సారా ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉండేవారని.. థాయ్‌లాండ్ ట్రిప్ తరువాత వారిద్దరు టచ్‌లో లేరని పేర్కొన్నారు. అయితే సుశాంత్ డిప్రెషన్‌తో బాధపడేవాడని, అతడికి బైపోలార్ డిసీజ్ ఉందని రియా సహా పలువురు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Read More:
ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.. విజయ దేవరకొండ టీమ్ క్లారిఫికేషన్