తన కల నెరవేరిందంటున్న పాయల్
'ఆర్‌ఎక్స్ 100' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా స్టార్ అయిపోయింది అందాల పాయల్ రాజ్ పుత్.
‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా స్టార్ అయిపోయింది అందాల పాయల్ రాజ్ పుత్. అదిరిపోయే అందాలతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపింది. వెంకటేష్, రవితేజ సీనియర్ హీరోల సరసన కూడా నటించి..మెప్పించింది. ఇప్పుడు తాజాగా తన డ్రీమ్ నెరవేరింది అని తెగ సంబరపడుతుంది ఈ భామ.
తెలుగులో డబ్బింగ్ చెప్పడం తన డ్రీమ్ అని, ప్రజంట్ తెరకెక్కుతున్న ఒక సినిమాలోని తన రోల్ కు డబ్బింగ్ చెప్పానంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. జయంత్ సి పరాన్జీ డైరెక్షన్లో పాయల్ ‘నరేంద్ర’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇది ఇండో-పాక్ బోర్డర్ లో జరిగే స్టోరీతో రూపొందుతుంది. ఈ సినిమాలో పాయల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.
My first dub in telugu ? pic.twitter.com/zuYFfEVBel
— paayal rajput (@starlingpayal) September 11, 2020