‘పుష్ప’ కోసం బన్నీ మేకోవర్
అల్లు అర్జున్ కొత్త సినిమా 'పుష్ప'. స్టైలిష్ స్టార్ గా పేరొందిన బన్నీ ఈ కొత్త సినిమా కోసం తన గెటప్ ను మరింత స్టైలిష్ చేసుకున్నాడు. ఆ మాటకొస్తే.. తన ప్రతీ సినిమానే కాదు, ప్రతీ రోజునూ ప్రత్యేకంగా డిజైన్ చేసుకోవడం..
అల్లు అర్జున్ కొత్త సినిమా ‘పుష్ప’. స్టైలిష్ స్టార్ గా పేరొందిన బన్నీ ఈ కొత్త సినిమా కోసం తన గెటప్ ను మరింత స్టైలిష్ చేసుకున్నాడు. ఆ మాటకొస్తే.. తన ప్రతీ సినిమానే కాదు, ప్రతీ రోజునూ ప్రత్యేకంగా డిజైన్ చేసుకోవడం అల్లు అర్జున్ సూపర్ స్పెషాలిటీ. ఇలా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకొనే బన్నీ ఈ సినిమా సందర్భంలో కూడా ఒక సరికొత్త లుక్ లో దర్శనం ఇచ్చి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. ఈ బన్నీ కొత్త లుక్కులు అతని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేపుతున్నాయి. రింగుల జుట్టుతో సరికొత్తగా కనిపించే బన్నీ లేటెస్ట్ పిక్స్ ను అతని టాలీవుడ్, మాలీవుడ్ ఫ్యాన్స్ నెట్టింట్లో భారీగా షేర్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం. అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.