ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌.. రాష్ట్రాలకు కొత్తమార్గదర్శకాలు

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ –ఈవోడీబీ కోసం 301 సంస్కరణలను అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ అండ్‌ ఇంటర్నల్‌

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌.. రాష్ట్రాలకు కొత్తమార్గదర్శకాలు
Follow us

| Edited By:

Updated on: Sep 13, 2020 | 10:52 AM

Ease of doing business: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ –ఈవోడీబీ కోసం 301 సంస్కరణలను అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌(డీపీఐఐటీ) సూచించింది. 2020–21 ర్యాంకుల కోసం మొత్తం 15 విభాగాల్లో నవంబర్‌లోగా ఈ సంస్కరణలను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక 2019 సంవత్సరానికి గానూ ఈడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచిన ఏపీ పరిశ్రమల శాఖ.. ఈ ఏడాదికి సంబంధించిన కొత్త మార్గదర్శకాల అమలుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది.

సంస్కరణల అమలుకు రెండున్నర నెలల సమయమే ఉండటంతో అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశాలు నిర్వహించి.. కొత్త మార్గదర్శకాలపై అవగాహన కల్పించేందుకు పరిశ్రమల శాఖ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక ఈ ఏడాది కొత్తగా పర్యాటకం, టెలికాం, ఆతిథ్యం, ట్రేడ్‌ లైసెన్స్, హెల్త్‌ కేర్, తూనికలు–కొలతలు, సినిమా హాళ్లు, సినిమా షూటింగ్‌ల విభాగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టబోతునట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ పేర్కొంది. ఇక సింగిల్‌ విండో విధానంలో ఆన్‌లైన్‌ దరఖాస్తు నమోదు మొదలు పన్నుల చెల్లింపులు, ధ్రువీకరణ పత్రాల స్వీకరణ, థర్డ్‌ పార్టీ వెరిఫికేషన్‌ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

Read More:

కోలుకున్నా ఈ జాగ్రత్తలు పాటించండి: కేంద్ర ఆరోగ్య శాఖ తాజా ప్రొటోకాల్‌

ఆమ్రపాలికి అరుదైన అవకాశం.. పీఎంలో స్థానం

Latest Articles