AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramanaidu Death Anniversary: మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు ఆరవ వర్ధంతి నేడు

కొంతమంది మరణించి చిరంజీవి.. శతాధిక చిత్ర నిర్మాత, మూవీ మొఘల్‌ దగ్గుబాటి రామానాయుడు ఆరవ వర్ధంతి నేడు.. సినీ కళామతల్లికి రామానాయుడు చేసిన సేవలు.. చరిత్రలో శాశ్వతంగా నిలిచిఉంటాయి...

Ramanaidu Death Anniversary: మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు ఆరవ వర్ధంతి నేడు
Surya Kala
|

Updated on: Feb 18, 2021 | 11:37 AM

Share

Ramanaidu Death Anniversary: కొంతమంది మరణించి చిరంజీవి.. శతాధిక చిత్ర నిర్మాత, మూవీ మొఘల్‌ దగ్గుబాటి రామానాయుడు ఆరవ వర్ధంతి నేడు.. సినీ కళామతల్లికి రామానాయుడు చేసిన సేవలు.. చరిత్రలో శాశ్వతంగా నిలిచిఉంటాయి. రూపాయి నోటు మీద ఉన్న అన్నిభాషల్లోనూ చిత్రాలను అంటే 13 బాషల్లోనూ రామానాయుడు సినిమాలను నిర్మించారు. 1963 అనురాగం సినిమా నిర్మాణంలో పాలుపంచుకుని సినీ ప్రస్థానం ప్రారంభించారు. తన పెద్ద కొడుకు పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ ని 1964లో స్థాపించి రాముడు భీముడితో సినీ నిర్మాణం సొంతగా ప్రారంభించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ ను డ్యూయల్ గా చూపించి తెలుగు సినీ నిర్మాణానికి కొత్త వరవడిని అద్దారు. ఆ సినిమా హిట్ తో మరిక నిర్మాణ రంగంలో వెనుదిరిగి చూసుకోలేదు. తన సినిమాల్లో సృజించని బంధంలేదు. నిర్మాణం చేపట్టని సబ్జెట్ లేదు. జానపద, సాంఘిక, పౌరాణిక నేపధ్యాల్లో సినిమాలను నిర్మించారు.

‘శ్రీకృష్ణ తులాభారం’ అంటూ సత్యభామ ఆత్మాభిమానాన్ని, ‘స్త్రీ జన్మ’ లో ఆడవారి మనో భావాలను, ‘సెక్రటరీ’ లో ఆడవారి ఆత్మాభిమానాన్ని, ‘అమ్మాయిల శపథం’లో అమ్మాయిల పంతాన్ని, ‘ప్రతిజ్ఞాపాలన’ తన సినిమాల ద్వారా ఆవిష్కరించిన ఘనుడు…సావాసగాళ్ళు, మొరటోడు, సోగ్గాడు, చక్రవాకము, ద్రోహి ఇలా విభిన్న పార్శవాల్లో హీరోల ను చూపించి హిట్ కొట్టిన వ్యాపార వేత్త, జీవనతరంగాలు, సిపాయి చిన్నయ్య, పాప కోసం, రాము, మాగల్య బలం, సూరిగాడు లాంటి సినిమాలతో కుంటుంబంలోని అనురాగాలన్ని సృజించారు. గురుబ్రహ్మ, కలియుగ పాండవులు, శ్రీకట్న లీలలు, ప్రతిధ్వని, సంఘర్షణ, కథానాయకుడు, ముందడుగు, మండే గుండెలు, ధర్మ చక్రం వంటి సాంఘిక నేపధ్యం లోని సినిమాలను నిర్మించి హిట్స్ అందుకున్న నిర్మాత… అహనా పెళ్ళంట, చిలిపి కృష్ణుడు, ఎంకి నాయుడుబావ, బెండు అప్పారావ్ ఆర్.ఎం.పి, ఒహొ నా పెళ్ళంట వంటి కామెడీ సినిలను కూడా నిర్మించి తన అభిరుచి ఏమిటో తెలియజెప్పారు. ప్రేమించుకుందాం రా, దేవత, అగ్నిపూలు, దేవత, ప్రేమ మందిరం, ప్రేమ, ప్రేమఖైదీ, ప్రేమనగర్ లాంటి ప్రేమ నేపధ్యంలో తీసిన సినిమాలతో ట్రెండ్ సెట్టర్ అయ్యారు.

కూలీ నెం. 1, సర్పయాగం, బొబ్బిలి రాజా , ఇంద్రుడు చంద్రుడు, బ్రహ్మ పుత్రుడు, తాజ్ మహల్, తాత మనవడు, ప్రేయసి రావే, మల్లీశ్వరి, నీకు నేను నాకు నువ్వు , నువ్వులేక నేను లేను, శివయ్య, కలిసుందాం రా, ప్రేమించు, గణేష్, అల్లరి, ఆంధ్రవైభవం, లాంటి పలు హిట్ సినిమాలను నిర్మించారు.

రామానాయుడు అనగానే ముందు గా గుర్తొచ్చే సినిమాల్లో ప్రేమనగర్…ఈ సినిమా ప్రేమలో అన్ని కోణాలని చూపించి నేటీకీ ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది. ఇక తాతామనుమడు సినిమాలో మనుష్యుల మధ్య అంతరించిపోతున్న అనుబంధాలను చూపించారు. ప్రేమించు సినిమాతో మనిషి శారీరకంగా వికలాంగులుండరు. మానసిక బలం తోడైతే ఏపనైనా సాధించవచ్చునని చూపించారు. గణేష్ సినిమాలో వైద్యం రంగాన్ని వ్యాపారం గా ఎలా మార్చేస్తున్నదీ చెప్పారు. ఒక్కటేమిటి మనిషికి మనిషికి మధ్య అనుబంధాలను, కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సిన అనురాగాన్ని, స్నేహితుల మధ్య ఉండే..నమ్మకాని, సామజికంగా మనిషి నెరవేర్చాల్సిన బాధ్యతను తన సినిమా మధ్యమం ద్వారా ప్రజలకు తెలియ జెప్పిన గొప్ప మనీషి రామానాయుడు.

ఇక రామానాయుడు తన సంస్థ ద్వారా తన తనయుడు వెంకటేష్ సహా ఎంతోమంచి నటీనటులను. దర్శకులను వెండి తెరకు పరిచయం చేశారు. రామానాయుడు పరిచయం చేస్తే వారు టాప్ పొజిషన్ లో కి వెళ్తారు అన్న సెంటిమెంట్ అప్పట్లో ఉండేదట.

Also Read:

వేలానికి కౌంట్ డౌన్ స్టార్ట్ .. ఈరోజు అదృష్టాన్ని పరీక్షించుకోనున్న స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు ఎవరంటే

 రైతుల నిరసన, నేడు దేశవ్యాప్తంగా 4 గంటలపాటు అన్నదాతల రైల్ రోకో ఆందోళన, శాంతియుత పంథాలో..