AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Auction 2021: వేలానికి కౌంట్ డౌన్ స్టార్ట్ .. ఈరోజు అదృష్టాన్ని పరీక్షించుకోనున్న స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు ఎవరంటే

ఇండియన్ ప్రీమియర్ లీగ్  ప్రతిభ ఉండి అవకాశాలు లేక ప్రపంచానికి ఎలా పరిచయం కావాలో తెలియని మేలిమి వజ్రాల వంటి ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. వాస్తవానికి ఈ ఐపిల్ క్రికెట్ స్థాయిని మరింత పెంచింది. కొంతమంది ఆటగాళ్లు..

IPL Auction 2021: వేలానికి కౌంట్ డౌన్ స్టార్ట్  .. ఈరోజు అదృష్టాన్ని పరీక్షించుకోనున్న స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు ఎవరంటే
Surya Kala
|

Updated on: Feb 18, 2021 | 11:08 AM

Share

IPL Auction 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్  ప్రతిభ ఉండి అవకాశాలు లేక ప్రపంచానికి ఎలా పరిచయం కావాలో తెలియని మేలిమి వజ్రాల వంటి ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. వాస్తవానికి ఈ ఐపిల్ క్రికెట్ స్థాయిని మరింత పెంచింది. కొంతమంది ఆటగాళ్లు కోటీశ్వరులైతే.. మరికొందరు వెలుగులోకి వచ్చి.. ఈ రోజు తమతమ దేశ క్రికెట్ జట్టులో అత్యున్నత ఆటగాళ్లుగా పేరుగాంచారు. పదేళ్లకు పైగా దిగ్విజయంగా ఐపీఎల్ ప్రయాణం సాగుతుంది. ఇక త్వరలో ఐపీఎల్ సీజన్ 14 జరగనున్న నేపథ్యంలో మొదటి అడుగు వేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం వేలంపాటను నిర్వహించనున్నారు.

2021 లో జరిగే 14వ సీజన్ ఆటగాళ్ల వేలం చెన్నై వేదికగా నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేలం కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వేలంలో భారతీయ ప్రముఖ క్రికెటర్స్ తో పాటు.. ప్రధాన విదేశీ క్రికెటర్స్ కూడా బరిలో నిలిచారు. ఇక తమ ప్రతిభను ఐపీఎల్ లో ప్రదర్శించి.. తద్వారా భారతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని దేశవాళీ కురాళ్ళ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఎవరు ప్రాంఛైజీలు మెప్పు పొందుతారు.. ఎవరు ఎక్కడ చోటు దక్కించుకుంటారో చూడాలి మరి..

ఐపీఎల్ ఏ స్టేజ్ లో ఖ్యాతిగాంచింది అంటే… విశ్వవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆటగాడిగా ప్రసిద్ధి పొందినా వారు కూడా ఈ ఐపీఎల్ లీగ్ లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూసేటంత.

అయితే ఈ రోజు జరగబోతున్న వేలం లో ఆదరి చూపు ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ డేవిడ్ మలన్ పైనే.. ఎందుకంటే టీ20 లో మలన్  నెంబర్.1 క్రీడాకారుడు.. ఇక అలెక్స్ హెల్స్ తో పాటు ఆసీస్‌ పేసర్‌ జే రిచర్డ్‌సన్‌, కివీస్‌ ఆల్‌రౌండర్ జేమీసన్‌ లు కూడా ప్రాంఛైజీలు ఆసక్తిని కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరు టాప్ ట్రేండింగ్ లో ఉండే అవకాశాలున్నాయని టాక్.

ఇక మ్యాక్స్ వెల్స్ , స్టార్ స్మిత్ లు కూడా ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చి గెలిపించగల సత్తా ఉన్నవారే..అంతేకాదు మరో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫించ్ కోసం పోటీ నెలకొననున్నదని తెలుస్తోంది. బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆటగాడు షకిబ్‌ పాటు ముస్తాఫిజుర్ , మోరిస్‌, జేసన్‌ రాయ్‌, లబుషేన్‌ లు వేలం పాట లిస్ట్ లో ఉన్నారు..

ఈ విదేశీ ఆటగాళ్ల తో పాటు దేశీయ ప్లేయర్స్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. హర్భజన్‌, పుజారా, విహారి, పియూష్‌, పవన్‌ నేగి, ఉమేశ్‌, దూబె తదితరు ఐపీఎల్ సీజన్ 14 ఆక్షన్ లో తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకోనున్నారు.

Also Read: