Keerthy Suresh: ‘మహానటి’ ప్రేమలో ఉంది నిజమేనా..? కీర్తి పేరెంట్స్ ఏమంటున్నారంటే..
Keerthy Suresh Parents Clarify About Her Marriage: 'మహానటి' సినిమాతో ఒక్కసారిగా భారతీయ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది అందాల భామ కీర్తి సురేశ్. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే..
Keerthy Suresh Parents Clarify About Her Marriage: ‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా భారతీయ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది అందాల భామ కీర్తి సురేశ్. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపును సంపాదించుకందీ బ్యూటీ. ఇక కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటూ వస్తోన్న కీర్తి సురేశ్ తాజాగా ఓ ఫొటోతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
కీర్తి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్‌తో కలిసి దిగిన ఓ ఫొటో ఈ చర్చకు దారి తీసింది. ఈ ఫొటోలో కీర్తి, అనిరుద్ కాస్త సాన్నిహిత్యంతో ఉండడంతో ఆ వార్తలకు ఆజ్యం పోసినట్లైంది. దీంతో కీర్తి సురేశ్, అనిరుద్ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారనే వార్త సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా తెగ హల్చల్ చేసింది. మరి కీర్తి.. నిజంగానే ప్రేమలో ఉందా..? వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారా.? అంటే ఈ హీరోయిన్ పేరెంట్స్ మాత్రం కాదని సమాధానం చెబుతున్నారు. ఈ వార్తలు వట్టి పుకార్లేనని ఖండిస్తున్నారు. తాజాగా కీర్తి సురేశ్ ప్రేమ విషయమై పేరెంట్స్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది వదంతి మాత్రమేనని, ఇందులో ఏ మాత్రం నిజం లేదని కీర్తి తండ్రి సురేశ్ పేర్కొన్నారు. కీర్తి ఎవరితోనూ ప్రేమలో లేదు.. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే ఉందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ ప్రస్తుతం.. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’తో పాటు రజినీకాంత్ ‘అన్నాత్తే’ సినిమాలతో బిజీగా ఉంది.
Also Read: Sonu Sood: అమ్మ మాటలతో ముందుకెళ్లా.. సినిమాలతో పేరొచ్చింది.. కానీ ‘సాయం’ సంతృప్తినిచ్చింది: సోనూసూద్