Tollywood: పట్టుకుంటే కందిపోతుందేమో.. డాడీ మూవీ బాలనటి ఇప్పుడు ఎలా ఉందంటే..?

డాడీ మూవీలో చిరంజీవి ముద్దులు తనయగా నటించిన ఈ పాపను గుర్తుపట్టారా..? తను ఇప్పుడు కళ్లు చెదిరే అందంతో అందర్నీ ఆకట్టుకుంటుంది. హీరోయిన్లను మించిన బ్యూటీ.. సూపర్ లుక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. ఇంతకీ ఆ అమ్మాయి లేటెస్ట్ ఫోటోలు మీరు చూశారా..?

Tollywood: పట్టుకుంటే కందిపోతుందేమో.. డాడీ మూవీ బాలనటి ఇప్పుడు ఎలా ఉందంటే..?
Anushka Malhotra
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 06, 2025 | 10:10 AM

చిరంజీవి నటించిన హిట్ సినిమాలకు ఒక లెక్క అంటూ ఉంటుందా చెప్పండి. చాలా అరుదుగా మాత్రమే అపజయాలను ఎదుర్కొన్నారు మెగాస్టార్. అప్పట్లో 200, 300 రోజులు ఆడుతూ బాస్ సినిమాలు రికార్డులు కొల్లగొట్టాయి. ఇప్పడంటే అంతా కలెక్షన్స్ పరంగానే ఆలోచిస్తున్నారులేండి. చిరు నటించిన సూపర్ సెంటిమెంట్ మూవీ డాడీ. ఫాదర్ అండ్ డాటర్ సెంట్రిక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. 2001లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో సిమ్రాన్ చిరు సరసన ఆడిపాడింది. సురేస్ కృష్ణ సినిమాను డైరెక్ట్ చేశారు. చిరు బావమరిది అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా స్టోరీ లైన్ మొదట చిరంజీవికి చెప్పినప్పుడు ఆయన వెంకటేష్ అయితే మంచి సినిమా అవుతుంది అని సూచించారట. కానీ కథా రచయిత భూపతిరాజా.. పట్టుబట్టి చిరంజీవి చేస్తేనే బాగుంటుందని ఒప్పించారట. అలా ముందుకెళ్లిన ఈ సినిమా చిరు కెరీర్‌లో మంచి హిట్‌గా నిలిచింది.

అయితే ఈ సినిమాలో చిరంజీవి కుమార్తెగా నటించిన పాప.. ప్రేక్షకుల మనసు దోచింది. చిరుకు, పాపకు మధ్య వచ్చే సన్నివేశాలు మనసును హత్తుకుంటాయి. కళ్లు చమర్చేలా చేస్తాయి. అయితే ఆ క్యూట్ పాప ఇప్పుడు ఏం చేస్తోంది.. సినిమా ఇండస్ట్రీలోనే ఉందా..? లేదా బయట లైఫ్ లీడ్ చేస్తుందా అని సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. తను ఇప్పుడు యంగ్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తోంది. ముట్టుకుంటే కందిపోయేంద అంత తన సొంతం. తన పేరు అనుష్క మల్హోత్రా. ముంబైకి చెందని ఈ చిన్నది.. తెలిసినవారి ద్వారా మెగాస్టార్ మూవీలో యాక్ట్ చేసే అవకాశాన్ని అందుకుంది. తను ఇప్పుడు ఫుల్ గ్లామర్ లుక్‌లోకి వెళ్లిపోయింది. చిత్ర పరిశ్రమకు దూరంగానే ఉంటున్న ఈ అమ్మడు.. సోషల్ మీడీయాలో కూడా అంత యాక్టీవ్ ఏం కాదు. తన ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.