మహర్షికి ‘కాపీ మరక’..?
టాలీవుడ్‌లో కాపీ క్యాట్ ఆరోపణలు వింటూనే ఉంటాం. పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ విషయాల్లో కూడా ఈ గుసగుసలు వినిపిస్తూంటాయి. ఈ సినిమా థీమ్ మాదంటే మాదని.. కోర్టుల వరకూ వెళ్లిన ఘటనలు చాలానే చూశాం. అయితే.. తాజాగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాకు ఈ తరహా ఆరోపణలు రావడం ఫిలింనగర్‌లో కొత్త చర్చకు దారితీసింది. అసలు.. నిజంగా మహర్షి సినిమా కాపీయేనా..? ఒక వేళ కాపీ అయితే ఎక్కడ […]
టాలీవుడ్‌లో కాపీ క్యాట్ ఆరోపణలు వింటూనే ఉంటాం. పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ విషయాల్లో కూడా ఈ గుసగుసలు వినిపిస్తూంటాయి. ఈ సినిమా థీమ్ మాదంటే మాదని.. కోర్టుల వరకూ వెళ్లిన ఘటనలు చాలానే చూశాం.
అయితే.. తాజాగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాకు ఈ తరహా ఆరోపణలు రావడం ఫిలింనగర్‌లో కొత్త చర్చకు దారితీసింది. అసలు.. నిజంగా మహర్షి సినిమా కాపీయేనా..? ఒక వేళ కాపీ అయితే ఎక్కడ నుంచి ఈ స్టోరీ తీసుకున్నారు..? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి.
‘మహర్షి’ సినిమా థీమ్ నాదేనంటూ డైరెక్టర్ శ్రీవాస్ చేసిన ఆరోపణలు టాలీవుడ్‌లో హీట్ పుట్టిస్తున్నాయి. అసలు విషయంలోకి వస్తే.. తన ఇమాజినేషన్ నుంచి పుట్టిన కథ మహర్షి అని.. డైరెక్టర్ శ్రీవాస్ దిల్‌రాజు వద్ద గోడు వెల్లబోసుకున్నారంట. ఈ సినిమా థీమ్ గురించి డైరెక్టర్ వంశీ గానీ, దిల్‌రాజు గానీ తనని సంప్రదించలేదని అన్నారు. కాగా.. శ్రీవాస్, వంశీ మీద, దిల్‌రాజు మీద ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ.. దిల్‌రాజు మాత్రం శ్రీవాస్‌తో ఈ విషయంపై చర్చించి.. ఇంతటితో వదిలేయని చెప్పినట్లు సమాచారం. మరి దీనిలో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.