AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హార్స్ రైడింగ్‌లో మెగాస్టార్‌ను మించిన హీరోనే లేడు..!

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు టాలీవుడ్‌లో ప్రత్యేక పేజీ ఉంటుంది. అద్భుత నటన, అదిరిపోయే డ్యాన్స్‌తో ఎన్నో హిట్‌లను మరెన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఆయన.. సినీ కళామతల్లి గర్వించదగ్గ హీరోగా ఖ్యాతిని ఘడించుకున్నారు. రాజకీయాల్లో చేరి టాలీవుడ్‌కు పదేళ్లు గ్యాప్ ఇచ్చినా.. ఆయన స్థానాన్ని మాత్రం ఎవ్వరూ భర్తీ చేయలేదు. అంతేకాదు భవిష్యత్‌లో కూడా చిరు స్థానం అలానే ఉంటుందన్నది టాలీవుడ్‌ ఎరిగిన సత్యం. ఇక తాజాగా చిరు సైరాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. […]

హార్స్ రైడింగ్‌లో మెగాస్టార్‌ను మించిన హీరోనే లేడు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 05, 2019 | 10:19 PM

Share

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు టాలీవుడ్‌లో ప్రత్యేక పేజీ ఉంటుంది. అద్భుత నటన, అదిరిపోయే డ్యాన్స్‌తో ఎన్నో హిట్‌లను మరెన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఆయన.. సినీ కళామతల్లి గర్వించదగ్గ హీరోగా ఖ్యాతిని ఘడించుకున్నారు. రాజకీయాల్లో చేరి టాలీవుడ్‌కు పదేళ్లు గ్యాప్ ఇచ్చినా.. ఆయన స్థానాన్ని మాత్రం ఎవ్వరూ భర్తీ చేయలేదు. అంతేకాదు భవిష్యత్‌లో కూడా చిరు స్థానం అలానే ఉంటుందన్నది టాలీవుడ్‌ ఎరిగిన సత్యం. ఇక తాజాగా చిరు సైరాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినీ ఇండస్ట్రీకి వచ్చి 41సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిరు.. మొత్తానికి ఈ మూవీతో తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. అయితే ఈ డ్రీమ్‌ను నెరవేర్చుకోవడం కోసం చిరు చాలానే కష్టపడ్డాడు. బరువు తగ్గడం కోసం తన వయసును పట్టించుకోకుండా ఆయన స్ట్రిక్ట్ డైట్‌ను ఫాలో అయ్యారు. ఏదేమైనా ఆయన ఇంత కష్టపడ్డారు కాబట్టే.. సైరా సినిమాలో ఆయన చేసిన యాక్షన్ సీన్లకు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు.

అయితే సైరా సినిమాలో అన్ని సన్నివేశాల్లో తనదైన నటనను కనబరిచిన చిరు.. హార్స్ రైడింగ్‌లో మరింత అదరగొట్టేశాడు. యువ హీరోలకు ధీటుగా ఆయన గుర్రపు స్వారీ చేశారు. ఇటీవల కాలంలో ప్రభాస్, రామ్ చరణ్, రానా, అల్లు అర్జున్‌, సాయి ధరమ్‌ తేజ్‌లు కొన్ని సినిమాల్లో హార్స్ రైడింగ్ చేయగా.. వారందరినీ మరిపిస్తూ చిరు గుర్రపు స్వారీ చేయడం విశేషం. దీంతో హార్స్ రైడింగ్‌లో చిరును మించిన హీరో లేడని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాగా హార్స్ రైడింగ్ ఆయనకు కొత్తేం కాదు. కొండవీటి దొంగ, బావగారు బావున్నారా, కొదమ సింహం, అల్లుడా మజాకా సహా పలు చిత్రాల్లో ఆయన హార్స్ రైడింగ్ చేశారు. ఇక రామ్ చరణ్ నటించిన బ్రూస్‌లీలో కెమెరా అప్పియరెన్స్ ఇచ్చిన ఆయన.. ఆ మూవీలోనూ చెర్రీతో పోటీ పడ్డాడు. అంతేకాదు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమయంలో 2010లో విశాఖ జిల్లాలోని పాయకరావుపేట అనే గ్రామంలోనూ ఆయన నడి వీధుల్లో హార్స్ రైడింగ్ చేసిన విషయం తెలిసిందే.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా