Operation Sindoor: ఒకే దేశం.. కలిసి నిలబడదాం.. ఆపరేషన్ సింధూర్ పై సెలబ్రెటీల రియాక్షన్స్..

పహల్గాం పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ విరుచుకుపడింది. మంగళవారం అర్దరాత్రి దాటిన తర్వాత పాక్ పై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టినట్లు సైన్యం అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Operation Sindoor: ఒకే దేశం.. కలిసి నిలబడదాం.. ఆపరేషన్ సింధూర్ పై సెలబ్రెటీల రియాక్షన్స్..
Anandh Mahindra, Chiranjeev

Updated on: May 07, 2025 | 8:47 AM

పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ పాక్ పై విరుచుకుపడింది. మంగళవారం అర్దరాత్రి దాటిన తర్వాత పాక్ లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించింది భారత ఆర్మీ. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది భారత్ సైన్యం. ఆపరేషన్ సింధూర్‏తో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఆపరేషన్ పెట్టినతోనే పాక్ కు బలమైన సందేశం పంపింది. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఆపరేషన్ సింధూర్ పేరును చూడొచ్చు.. అలాగే యోధులకు పెట్టే వీరతిలకం అనే అర్థం సైతం ఇందులో ఉంది. ఇదంతా పక్కనపెడితే ఆపరేషన్ సింధూర్ పై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆపరేషన్ సింధూర్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై హింద్, భారత్ మాతాకీ జై అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహింద్రా తన ట్విట్టర్ ఖాతాలో ఆపరేషన్ సింధూర్ పై రియాక్ట్ అయ్యారు. “మా ప్రార్ధనలన్నీ భద్రతా బలగాలతోనే ఉంటాయి. ఒకే దేశం.. కలిసి నిలబడదాం” అంటూ ట్వీట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా ట్వీట్..

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్.. 

జై హింద్ ట్వీట్..

రితేష్ దేశ్ ముఖ్ ట్వీట్..
“జై హింద్ కీ సేనా.. భారత్ మాతాకీ జై..” అంటూ ట్వీట్ చేశారు..

ఖుష్బూ ట్వీట్..
“భారత్ మాతాక కీ జై.. న్యాయం జరిగింది..” అంటూ ట్వీట్ చేసారు.

మధుకర్ భండార్కర్ ట్వీట్..

“భద్రతా ధళాలకు మరింత బలాన్నివ్వాలని ప్రార్థిద్దాం.. ఒకే దేశం.. కలిసి నిలబడదాం. వందేమాతరం” అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..