AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrahass: బూతు పాట కాంట్రవర్సీ.. హీరో చంద్రహాస్పై పోలీస్ కేసు నమోదు.. ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా?

’బరాబర్‌ ప్రేమిస్తా’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ప్రభాకర్ కుమారుడు, హీరో చంద్రహాస్ లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అతిథులను ఆకట్టుకునేందుకు 'గుంజీ గుంజీ' అనే పాటను పాడాడు. అయితే ఈ సాంగ్ లిరిక్స్ లో కొన్ని బూతులు ఉండడంతో చంద్రహాస్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Chandrahass: బూతు పాట కాంట్రవర్సీ.. హీరో చంద్రహాస్పై పోలీస్ కేసు నమోదు.. ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా?
Actor Chandrahass
Basha Shek
|

Updated on: Feb 05, 2026 | 6:34 AM

Share

‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో చంద్రహాస్ పాడిన ‘గుంజీ గుంజీ’ పాట తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఈ పాట లిరిక్స్ లో బూతులు ఉండడం, దానిని చంద్రహాస్ సినీ ప్రముఖులు, మహిళల ముందే పాడడంపై చాలా మంది మండిపడుతున్నారు హీరో చంద్రహాస్ తీరును తప్పుపడుతున్నారు. అయితే తన సాంగ్ పై వస్తోన్న విమర్శలకు చంద్రహాస్ కూడా గట్టిగానే స్పందించాడు ఈ మేరకు ఒక వీడియో కూడా రిలీజ్ చేసి ఎవరికీ క్షమాపణలు చెప్పేది లేదని ఖరాఖండిగా చెప్పాడు. అయితే ఇప్పుడీ కాంట్రవర్సీ సాంగ్ కు సంబంధించి చంద్రహాస్ పై హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. స్టేజ్ పై బూతు పాట పాడి అవమానించినట్లు ప్రభాకర్ కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ ప్రముఖ టీవీ ఎడిటర్ చేసిన ఫిర్యాదు మేరకు చంద్రహాస్ పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ వారుసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు చంద్రహాస్. నిర్మలా కాన్వెంట్ వంటి సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అతను రామ్ గనర్ బన్నీ సినిమాతో హీరోగా మారాడు. ఇందులో అతని డ్యాన్సులు, ఫైట్లకు మంచి మార్కులే పడ్డాయి. అయితే సినిమాల కంటే తన ప్రవర్తనతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు చంద్రహాస్. సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలో అతని బిహేవియర్ ను చూసి ‘యాటిట్యూడ్ స్టార్’ అని ట్యాగ్ ఇచ్చేసారు నెటిజన్లు. మొదటి సినిమా తరవాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ హీరో ఇప్పుడు ‘బరాబర్ ప్రేమిస్తా’ అంటూ మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో చంద్రహాస్‌ ఒక బూతు పాటను పాడడం ఇప్పుడు వివాదానికి కారణమైంది.

ఇవి కూడా చదవండి

చంద్రహాస్ రిలీజ్ చేసిన మరో వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by Chandra Hass (@chandrahass8)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..