Guess the actress: కొంగుచాటున దాగిన అందం.. మీరనుకుంటోన్న బ్యూటీ మాత్రం కాదండోయ్..

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తమ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు సెలబ్రిటీలు. ఒకప్పుడు సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలంటే టీవీలు, వార్త పత్రికలు మాత్రమే మార్గం. కానీ ఎప్పుడైతే సోషల్‌ మీడియా అందుబాటులోకి...

Guess the actress: కొంగుచాటున దాగిన అందం.. మీరనుకుంటోన్న బ్యూటీ మాత్రం కాదండోయ్..
Guess The Actress
Follow us

|

Updated on: Mar 31, 2023 | 7:01 AM

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తమ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు సెలబ్రిటీలు. ఒకప్పుడు సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలంటే టీవీలు, వార్త పత్రికలు మాత్రమే మార్గం. కానీ ఎప్పుడైతే సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి సినీతారలు వ్యక్తిగత జీవితాలు సైతం అభిమానులకు తెలిసిపోతున్నాయి. మరీముఖ్యంగా హీరోయిన్లు సోషల్‌ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. సినిమా విషయాలకే పరిమితం కాకుండా పర్సనల్‌ లైఫ్‌ విషయాలను సైతం షేర్‌ చేసుకుంటున్నారు. ఇక లేటెస్ట్ ఫొటోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. లేటెస్ట్ అవుట్‌ఫిట్స్‌లో దిగే ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటున్నారు బ్యూటీస్‌.

తాజాగా ఓ అందాల తార తన లేటెస్ట్‌ ఫొటోలను పోస్ట్‌ చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. పైన ఫొటోలో పింక్‌ కలర్‌ శారీలో కనిపిస్తున్న ఈ అందాల తారే ఆ హీరోయిన్‌. కొంగు చాటున ముఖాన్ని దాచి కనిపించీ, కనిపించకుండా ఉన్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? చేసినవి కొన్ని సినిమాలే అయినా ఇటీవల టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిందీ బ్యూటీ. సినిమాల కంటే వ్యక్తిగత జీవితంతోనే వైరల్‌ అవుతోంది. టాలీవుడ్‌కు చెందిన యంగ్‌ హీరోతో డేటింగ్‌లో ఉందంటూ ఈ వబ్యూటీకి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ చిన్నది ఎవరో ఇప్పటికే మీకు ఓ క్లారిటీ వచ్చేసింది కదూ!

ఇవి కూడా చదవండి

Guess The Actress

అవును ఈ చిన్నది మరెవరో కాదు శోభిత ధూళిపాళ. 2018లో వచ్చిన గూడఛారి మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. తనదైన అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. అనంతి కాలంలోనే మంచి నటిగా పేరు సంపాదించుకుంది. ఇక తాజాగా యంగ్‌ హీరో నాగచైతన్యతో డేటింగ్‌లో ఉందన్న వార్తలతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిందీ చిన్నది. తాజాగా లండన్‌లోలోని ఓ హోటల్‌లో నాగచైతన్యతో శోభిత ఉన్నట్లు ఓ ఫొటో నెట్టింట వైరల్‌ అయ్యింది. దీంతో వీరిద్దరూ నిజంగానే డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలకు బలం చేకూరినట్లైంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఇటు శోభిత కానీ, చైతన్య కానీ అధికారికంగా స్పందించింది లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..