Karnataka: కాంతార సీన్ రివర్స్.. దైవ నృత్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు

డ్యాన్సింగ్ వితౌట్ స్టాప్ అనేది.. వెరీవెరీ డేంజరస్. డాక్టర్లు కూడా కన్‌ఫమ్ చేసిన ఈ విషయాన్ని.. కర్నాటకలో ఒక డివైన్ డ్యాన్సర్‌ ప్రాక్టికల్‌గానే ప్రూవ్ చేశారు.

Karnataka: కాంతార సీన్ రివర్స్.. దైవ నృత్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు
Kantara
Follow us

|

Updated on: Mar 31, 2023 | 7:00 AM

డోన్ట్‌ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్..! అని మెగాస్టార్ పిలుపునిస్తే ఇచ్చారు. మీరు మాత్రం ఆపకుండా డ్యాన్సులెయ్యకండి. ఎందుకంటే.. డ్యాన్సింగ్ వితౌట్ స్టాప్ అనేది.. వెరీవెరీ డేంజరస్. డాక్టర్లు కూడా కన్‌ఫమ్ చేసిన ఈ విషయాన్ని.. కర్నాటకలో ఒక డివైన్ డ్యాన్సర్‌ ప్రాక్టికల్‌గానే ప్రూవ్ చేశారు. కాంతార తరహా డ్యాన్స్ అడుతుండగానే కుప్పకూలిపోయాడు. సడన్‌గా గుండె ఆగి చనిపోయాడు. మరి.. పోతూపోతూ సమాజానికి ఆయనిచ్చిన మెసేజ్ ఏంటి? పూనకాలు లోడైతే ముంచుకొచ్చే ప్రమాదాలేంటి?

దేవతా నృత్యం.. గ్రామీణ ఆధ్యాత్మిక వాతావరణంలో గూడుకట్టుకున్న గాఢమైన విశ్వాసం. తమ ఊరి దేవతే ఆత్మరూపంలో ఆ నృత్యకారుడి ఒంట్లో ఆవహించి.. తమకు దర్శనభాగ్యం కల్పించినట్టు భావిస్తారు గ్రామస్థులు. అటువంటి నృత్యాల్లో ఒకటి కాంతార. విశ్వాసానికి అడ్డం తిరిగిన ఊరిజనంపై కోపగించుకుని.. పంచభూతాల్లో కలిసిపోయిన గ్రామదేవతగా ఈ సినిమా తర్వాత బాగా ఫేమస్సైపోయింది కాంతార వరాహ అవతారం. సరిగ్గా ఇదే రీతిలో.. వందలాదిమంది గ్రామస్థుల సమక్షంలో శిరడీ నృత్యం ఆడుతుండగానే కుప్పకూలిపోయాడొక దైవ నర్తకుడు.

దక్షిణ కర్నాటకలోని దోల్పాడి గ్రామంలో జరిగిన ఈ ఘటన.. స్థానికంగా పెను విషాదం నింపింది. మృతుడి పేరు కంటు అజిలా మూలంగిరి.. వయసు 55 ఏళ్లు. ఊరివాళ్లు ఇష్టంగా బాబు అని పిలుచుకుంటారు. ఏడమంగల గ్రామానికి చెందిన మూలంగిరికి డివైన్ డ్యాన్సర్‌గా ఆ ప్రాంతంలో మంచి పాపులారిటీ ఉంది. కానీ.. గ్రామ దేవతల పరిచారకుడిగా, దైవ నర్తకుడిగా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న మూలంగిరికి అదే ఆఖరి ప్రదర్శనగా మారింది. అతడు గుండెపోటు వల్లే చనిపోయినట్టు నిర్ధారించారు డాక్టర్లు. ఆయనే దేవదూత అని, ఆయనలోనే దేవుణ్ణి చూసుకున్న గ్రామస్థులు… తమ కళ్ల ముందే జరిగిన ఈ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దైవసేవలో ఉంటుండగానే దేవుడిలో లీనమయ్యాడని, అతడి జన్మ ధన్యమైందని కొందరంటారు.