మహేష్, అనుష్కకు స్టార్ ఇమేజ్ తెచ్చిన దర్శకుడు.. హిట్ కోసం వెయిటింగ్! ఈసారైనా దక్కేనా?
టాలీవుడ్ చరిత్రలో ఒకే ఒక్క సినిమాతో ప్రిన్స్ మహేష్ బాబుని ‘సూపర్‌స్టార్ మహేష్ బాబు’గా ఎలివేట్ చేసిన ఘనత ఆ డైరెక్టర్‌దే. 2003లో వచ్చిన ఆ ఒక్క బ్లాక్‌బస్టర్‌తో ఇండస్ట్రీనే షేక్ చేసి, మహేష్ కెరీర్‌ను ఎవరెస్ట్ ఎత్తుకు తీసుకెళ్లిన మాంత్రికుడు ఆయన. మహేష్ ..

టాలీవుడ్ చరిత్రలో ఒకే ఒక్క సినిమాతో ప్రిన్స్ మహేష్ బాబుని ‘సూపర్‌స్టార్ మహేష్ బాబు’గా ఎలివేట్ చేసిన ఘనత ఆ డైరెక్టర్‌దే. 2003లో వచ్చిన ఆ ఒక్క బ్లాక్‌బస్టర్‌తో ఇండస్ట్రీనే షేక్ చేసి, మహేష్ కెరీర్‌ను ఎవరెస్ట్ ఎత్తుకు తీసుకెళ్లిన మాంత్రికుడు ఆయన. మహేష్ కెరీర్లో ‘ఒక్కడు’, ‘అర్జున్’ సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకమే. హిట్ సినిమాలతో రాణించి తర్వాత పురాణాలు, హిస్టారికల్స్, మైథాలజికల్స్‌తో తనదైన ముద్ర వేసుకున్నాడు.
కానీ గత ఎనిమిదేళ్లలో వచ్చిన వరుస ఫ్లాప్‌లతో కొంచెం బ్యాక్‌ఫుట్‌కు వెళ్లిపోయాడు. ఇప్పుడు మొదటిసారి ప్యూర్ థ్రిల్లర్ జోనర్‌లోకి అడుగుపెడుతూ… మళ్లీ హిట్ ట్రాక్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. మరి ఆ డైరెక్టర్ ప్రేక్షకులను ఈసారైనా మెప్పిస్తారా? ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు?
టాలీవుడ్‌లో ఒక్కడితో మహేష్‌ను సూపర్‌స్టార్‌గా మలిచిన మాంత్రికుడు, పురాణాలను పిల్లలకు ఆసక్తికరంగా చెప్పిన క్రియేటివ్ జీనియస్, రుద్రమదేవి, శాకుంతలం వంటి భారీ కాన్వాస్‌లతో తనదైన ముద్ర వేసిన స్టార్ డైరెక్టర్, ఇప్పుడు థ్రిల్లర్‌తో మళ్లీ రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతున్న డైరెక్టర్.. ఆయనే గుణశేఖర్.
టాలీవుడ్‌లో 1990ల నుంచి డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన గుణశేఖర్, తన మొదటి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. పిల్లలకు పురాణాలను ఆసక్తికరంగా చెప్పిన ‘రామాయణం’ (1995) సూపర్‌హిట్ అయ్యింది. తర్వాత మహేష్ బాబుతో ‘ఒక్కడు’ (2003) తీసి బ్లాక్‌బస్టర్ కొట్టి, మహేష్‌ను సూపర్‌స్టార్‌గా నిలిపారు. అక్కడి నుంచి మహేష్ కెరీర్ గ్రాఫ్ పైపైకి ఎగిరిందంటే… అందులో గుణశేఖర్ పాత్రే చాలా ఉంది!

Anushka And Mahesh And Guna Shekar
అలాగే ‘రుద్రమదేవి’ (2015), ‘శాకుంతలం’ (2023) వంటి భారీ ప్రాజెక్టులతో పురాణ-హిస్టారికల్ ఇమేజ్ సంపాదించారు. కానీ ఇటీవలి ఫ్లాప్‌లు ఆ ఇమేజ్‌కు కాస్త డ్యామేజ్ చేశాయి. ఇప్పుడు మొదటిసారి ప్యూర్ థ్రిల్లర్ జోనర్‌లోకి అడుగుపెడుతున్నారు.
‘యుఫోరియా’. భూమిక, సారా అర్జున్, నాజర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు థ్రిల్లర్ ఎంచుకున్న గుణశేఖర్… ఈసారైనా బ్లాక్‌బస్టర్ కొట్టి, మహేష్ తర్వాత మళ్లీ ఒక స్టార్‌ను క్రియేట్ చేస్తారా? అనే ఆసక్తి ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది!




