The Vaccine War: కరోనాతో శాస్త్రవేత్తల యుద్ధం.. ‘ది వ్యాక్సిన్ వార్’ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాతో నేషనల్ వైడ్‌గా పాపులారిటీ సొంతం చేసుకున్నారు వివేక్ అగ్నిహోత్రి. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. కాగా ఈ మూవీ తర్వాత మరో యదార్థ సంఘటన ఆధారంగానే సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు అగ్నిహోత్రి. కొన్ని నెలల క్రితమే 'ది వ్యాక్సిన్ వార్' అనే టైటిల్ తో ఒక సినిమాను కూడా అనౌన్స్ చేశారు. తాజాగా ఆ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు
‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో నేషనల్ వైడ్‌గా పాపులారిటీ సొంతం చేసుకున్నారు వివేక్ అగ్నిహోత్రి. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. కాగా ఈ మూవీ తర్వాత మరో యదార్థ సంఘటన ఆధారంగానే సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు అగ్నిహోత్రి. కొన్ని నెలల క్రితమే ‘ది వ్యాక్సిన్ వార్’ అనే టైటిల్ తో ఒక సినిమాను కూడా అనౌన్స్ చేశారు. తాజాగా ఆ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ సైంటిస్ట్ పాత్రలో నటిస్తోంది. ఆమెతో పాఉ నానా పటేకర్, పల్లవి జోషి, రైమాసేన్, అనుపమ్ ఖేర్, నివేదిత భట్టాచార్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ది వ్యాక్సిన్ వార్ ఈనెల 28న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కరోనా మహమ్మారి సమయంలో దానిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు ఎలా అభివృద్ధి చేశారనేది ఈ చిత్రంలో చూపించనున్నారు డైరెక్టర్. ఇప్పటికే పలు దేశాల్లో ది వ్యాక్సిన్ వార్ సినిమాను ప్రీమియర్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. డైరెక్టర్ వివేక్ స్వయంగా వెళ్లి అమెరికాలోని వెళ్లి పలు ప్రాంతాల్లో భారతీయుల కోసం సొంతంగా ప్రీమియర్ షోలను ప్రదర్శించాడు. ఈ సినిమా చూసిన కొందరు తమ పాజిటివ్ రియాక్షన్స్ ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక ఇండియాలో సెప్టెంబర్ 28న ది వ్యాక్సిన్ వార్ సినిమా రిలీజ్ కానుంది.
గతంలో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించగా, ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అదే సమయంలో వివాదాలు కూడా సృష్టించింది. ఈ సినిమాకు బీజేపీకి చెందిన పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. కర్ణాటక సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ చిత్రానికి పన్ను మినహాయింపు కూడా లభించింది. దీంతో అప్పటి నుంచి వివేక్ అగ్నిహోత్రి బీజేపీ అనుకూల వ్యక్తిగా ముద్రవేశారు. ఈక్రమంలోనే వివేక్ అగ్నిహోత్రి తన తదుపరి సినిమాకు వ్యాక్సిన్ కథను ఎంచుకున్నాడు. కాగా కాంతారా సినిమాతో ఆకట్టుకున్న సప్తమి గౌడ ది వ్యాక్సిన్ వార్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది.
ది వ్యాక్సిన్ వార్ సినిమా పోస్టర్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.