Virat Kohli-Anushka Sharma: విరాట్, అనుష్కల హాలీడే ఇంటిని చూశారా ?.. విలాసవంతమైన ఇంటికి ఎన్నో ప్రత్యేకతలు..
కేవలం అక్కడే మాత్రమే తనకు సొంత ఇల్లు ఉన్నట్లు గతంలో అనేకసార్లు చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు కోహ్లీ సొంతింటి కల సాకారమైంది. 023 ఆసియా కప్‌కు ముందు, విరాట్ కోహ్లీ, అనుష్క కలిసి అలీబాగ్ ను సందర్శించారు. అక్కడ వీరు విలాసవంతమైన ఫామ్ హౌస్ ను నిర్మించుకున్నారు. ఈ లగ్జరీ ఇంటిని బిరుష్కర్ రూపొందించారు. ప్రస్తుతం తన ఇంటిని పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశాడు కోహ్లీ. అలీబాగ్ రాజ్ ప్యాలెస్ వీడియో అంటూ తన ఇన్ స్టాలో షేర్ చేశారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ జంట విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ. వీరిద్దరికి వరల్డ్ వైడ్ ఎంతో ఫాలోయింగ్ ఉంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది అనుష్క. ఇక విరాట్ విషయానికి వస్తే.. క్రీడల్లో అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్ కోహ్లీ. ఢిల్లీలో జన్మించిన అతను ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నాడు. కేవలం అక్కడే మాత్రమే తనకు సొంత ఇల్లు ఉన్నట్లు గతంలో అనేకసార్లు చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు కోహ్లీ సొంతింటి కల సాకారమైంది. 023 ఆసియా కప్‌కు ముందు, విరాట్ కోహ్లీ, అనుష్క కలిసి అలీబాగ్ ను సందర్శించారు. అక్కడ వీరు విలాసవంతమైన ఫామ్ హౌస్ ను నిర్మించుకున్నారు. ఈ లగ్జరీ ఇంటిని బిరుష్కర్ రూపొందించారు. ప్రస్తుతం తన ఇంటిని పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశాడు కోహ్లీ. అలీబాగ్ రాజ్ ప్యాలెస్ వీడియో అంటూ తన ఇన్ స్టాలో షేర్ చేశారు.
ఆ వీడియోలో విరాట్ ఇళ్లంతా తిరుగుతూ అభిమానులకు స్వయంగా తన ఇంటి గురించి చెబుతూ కనిపించాడు. అలీబాగ్‌లో దాదాపు 8 ఎకరాల స్థలంలో అలీబాగ్ నిర్మించబడిందని.. మొత్తం 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటిలో కాలిఫోర్నియా కొంకణ్ శైలిలో నాలుగు బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. ఎత్తైన పైకప్పులు.. ఇంటి చుట్టూ అద్దాల గోడలు ఉన్నాయి. లివింగ్ రూమ్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది. లివింగ్ రూంలో టీవీ ఉండకుండ చూసుకున్నాడు విరాట్. ఎందుకంటే ఇంటి సభ్యులంతా కలిసి మాట్లాడుకోవడం తనకు ఇష్టమని.. అందుకే టీవీ ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
Kickstarting 2024 at the Baugh! Love my new holiday home at Avās Living, Alibaugh. Super excited to give you a sneak peak into my oasis. . .#avasxvirat #inhabityourbestself #alibaug #baughofwonders #luxuryvillas #avaswellness #ad @AvasWellness pic.twitter.com/Y7vnGdvSZH
— Virat Kohli (@imVkohli) January 10, 2024
ఇక నుంచి అలీబాగ్‌లోని ఈ బంగ్లా తన హాలిడే డెస్టినేషన్‌గా మారనుందని విరాట్ కోహ్లీ అన్నాడు. తన కలల ఇంటిలో తన కుటుంబసభ్యులందరితో కలిసి సమయం గడపాలని ఉందని అన్నారు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎక్కువ ఇష్టం ఉండడంతో ఎక్కువ సమయం కుటుంబంతో గడపలేకపోయానని.. ఇప్పుడు మాత్రం కుటుంబానికే మొదటి స్థానం ఇస్తానని అన్నారు. ప్రస్తుతం విరాట్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.