Tollywood: చదువులో వెరీ పూర్.. కానీ సినిమాల్లో సూపర్ స్టార్.. ఈ హీరో ఆస్తులు 1800 కోట్లకు పైనే.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలామంది పెద్దగా చదువుకోని వారే. ఆర్థిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో పది, ఇంటర్మీడియెట్ తో ఆపేసిన వారే. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని ఏలేసిన ఈ స్టార్ హీరో కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు.

Tollywood: చదువులో వెరీ పూర్.. కానీ సినిమాల్లో సూపర్ స్టార్.. ఈ హీరో ఆస్తులు 1800 కోట్లకు పైనే.. ఎవరో తెలుసా?
Bollywood Actor

Updated on: May 01, 2025 | 5:17 PM

ఇప్పుడంటే చదువకోవడానికి చాలా అవకాశాలున్నాయి. కానీ కొన్నేళ్ల ముందు పరిస్థితులు భిన్నంగా ఉండేవి. చదువుకోవడానికి కుటుంబ పరిస్థితులు అసలు సహకరించేవి కావు. ఈ స్టార్ హీరోది కూడా దాదాపు సేమ్ టు సేమ్ ఇలాంటి పరిస్థితే. ఇతను చదువులో చాలా పూర్. దీంతో తనకు ఇష్టమైన నాటక రంగంలో కెరీర్ ను వెతుక్కోవాలని చూశాడు. కానీ అక్కడ కూడా అతనికి నిరాశే ఎదురైంంది. అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. అయితే ఊహించని ఒక సంఘటనతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అడ్డంకులు, అవమానాలు ఎదుర్కొంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం భారతీయ సినిమా గర్వించదగ్గ నటుల్లో ఈ స్టార్ హీరో కూడా ఒకరు. తన ఖాతాలో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అంతేకాదు తన నటనా ప్రతిభకు ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇప్పుడు కూడా ఒక్కో సినిమాకు కనీసం వంద కోట్లైనా పారితోషకంగా తీసుకుంటాడీ హీరో. తద్వారా భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇక హీరో గారి ఆస్తి సుమారు రూ. 1800 కోట్లకు పైగానే ఉంటుంది. అయితే ఈ మధ్యన సినిమాల కంటే తన రిలేషన్ షిప్ విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడీ సీనియర్ హీరో. ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకుని ఇద్దరు భార్యలకూ విడాకులు ఇచ్చేశాడీ స్టార్ యాక్టర్. ఇప్పుడు మూడో పెళ్లి కూడా చేసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్గుగానే ఇటీవల ఒక కొత్త మహిళతో తరచూ కనిపిస్తున్నాడు. మరి ఈ పాటికే అర్థమై ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. అతను మరెవరో కాదు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.

 

ఇవి కూడా చదవండి

కాగా ఆమిర్ ఖాన్ చదువులో బాగా పూర్. చదువు పెద్దగా అబ్బలేదు. స్కూల్లో ఎప్పుడూ ఏదో ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యేవాడు. దీంతో తండ్రి నిర్మాత తాహిర్ హుస్సేన్ ఆమిర్ ను తరచూ తిట్టేవారట. ఈకారణంగానే ఆమిర్ క ఎంతో ఇష్టమైన టెన్నిస్ ఆడొద్దని కండిషన్ పెట్టాడట.దీంతో క్రమంగా నాటకాలపై ఆసక్తి పెంచుకున్నాడ. అయితే అక్కడ కూడా రిజెక్షన్స్ తప్పలేదట. స్కూల్ లో జరిగిన ఒక నాటకం నుంచి తీసేయడంతో బాగా కుండిపోయాడట ఆమిర్. అయితే ఆ తర్వాత . FTII విద్యార్థులు ఆమిర్ ను ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించాలని కోరాట. అక్కడ తన యాక్టింగ్ ట్యాలెంట్ మొత్తం చూపించడంతో అమిర్ కు సినిమాల్లో అవకాశం వచ్చిందట. ఇక ఆ తర్వాత ఈ స్టార్ హీరోకు వెనుదిరిగి చూసే అవకాశం రాలేదట.

ఆమిర్ ఖాన్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..