Tollywood: ఒకప్పుడు పొట్ట కూటి కోసం టైలర్‌గా.. ఇప్పుడు సినిమాల్లో తిరుగులేని స్టార్‌గా.. ఎవరో తెలుసా?
ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఇతను మొదట ఇండియన్ ఆర్మీలో చేరాలనుకున్నాడు. సరిహద్దుల్లో ఉండి దేశానికి సేవలు చేయాలనుకున్నాడు. కానీ అందుకు అతని హైట్ సరిపోలేదు. ఫలితంగా సినిమాల్లో అదృష్టం పరీక్షించుకున్నాడు. నటుడిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది కెరీర్ ప్రారంభంలో వివిధ రకాల పనులు, ఉద్యోగాలు చేసిన వారే. కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న పనులు, జాబ్ లు చేసిన వారు కూడా ఉన్నారు. ఈ విలక్షణ నటుడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో నటిస్తోన్న ఈ యాక్టర్ ఒకానొక దశలో తన కుటుంబ పోషణ కోసం టైలర్ గా మారాల్సి వచ్చింది. అలా వచ్చిన డబ్బులతోనే తండ్రి దండ్రులను పోషించాడు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జన్మించిన ఇతను జీవితంలో ఎన్నో సాధించాలనుకున్నాడు. మొదటగా భారత సైన్యంలో చేరాలనకున్నాడు. కానీ హైట్ అతని కలలకు అవరోధంగా నిలిచింది. దీంతో ఏం చేయాలో తోచలేక అయోమయంలో పడ్డాడు. అదే సమయంలో కుటుంబ పోషణ కోసం దర్జీగా పనిచేయవలసి వచ్చింది. ఆ తర్వాత నటనపై మక్కువతో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. కానీ సినిమాల్లోకి వచ్చేందుకు చాలా సమయం పట్టింది. అంతలోనే ఇతని జీవితంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మొదటి బిడ్డకు జన్మనిచ్చే సమయంలో భార్య కన్నుమూసింది. అప్పటికింకా అతనికి కేవలం 20 సంవత్సరాలు మాత్రమే.
భార్య మరణం నుంచి తేరుకోవడానికి ఈ నటుడికి చాలా సమయం పట్టింది. అయితే మెల్లగా ఈ విషాదం నుంచి తేరుకుని మళ్లీ తనకిష్టమైన సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ నటుడు రామ్ గోపాల్ వర్మ సినిమాతో బాగా ఫేమ్ అయ్యాడు. ఆ తర్వాత అతనికి ఎదురులేకుండా పోయింది. విలన్ గా, కమెడియన గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇప్పుడు బాలీవుడ్ లో ఏ స్టార్ హీరో సినిమా అయినా ఈ నటుడు ఉండాల్సిందే. ఏడాదికి 6, 7 సినిమాల్లో నటిస్తూ బిజి బిజీగా ఉంటోన్న ఆ స్టార్ నటుడు మరెవరో కాదు రాజ్ పాల్ యాదవ్.
రాజ్ పాల్ యాదవ్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
రామ్ గోపాల్ వర్మ జంగిల్ (2000) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజ్ పాల్ యాదవ్. ఆ తర్వాత హంగామా, భూల్ భులైయా, మలమాల్ వీక్లీ, ధోల్, చుప్ చుప్ కే, భాగమ్ భాగ్, ఖట్టా మీఠా, హేరా-ఫేరీ తదితర హిట్ సినిమాలతో స్టార్ నటుడిగా మారిపోయాడు. 2007లో రిలీజైన భూల్ భూలయ్యా చిత్రం రాజ్ పాల్ యాదవ్ కెరీర్‌లో మరుపురాని చిత్రంగా మిగిలిపోయింది. ఇందులో అతను పోషించిన ‘ఛోటే పండిట్’ పాత్రకు మంచి పేరొచ్చింది. భూల్ భూలయ్యా సిరీస్ లో వచ్చిన మూడు సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు మారినా రాజ్ పాల్ మాత్రం కంటిన్యూ అయ్యాడు.
కూతురితో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








