Sonu Sood: రియల్ హీరో సోనూసూద్‌కు కరోనా పాజిటివ్.. ఏమని ట్విట్ చేశాడో తెలుసా..?
Covid-19 - Sonu Sood: దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ
Sonu Sood – Covid-19 : దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో నటుడు కరోనా బారిన పడ్డాడు. రియల్ హీరో సోనూసూద్‌కు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ మేరకు ఆయన ట్విట్ చేసి వెల్లడించాడు. ఆయన కోలుకోవాలంటూ అభిమానులంతా సోషల్ మీడియాలో ప్రార్థిస్తున్నారు. గతేడాది కరోనా విపత్కర పరిస్థితుల్లో సోనూసూద్ వేలాది మందికి ప్రత్యేక్షంగా సాయం చేసి అందరి మన్ననలు పొందాడు. శనివారం మధ్యాహ్నం తనకు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు సోనూసూద్ ట్విట్ చేశాడు.
”నాకు ఈ రోజు ఉదయం కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లోకి వెళ్లాను. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాను. బాధపడకండి.. మీ సమస్యలను పరిష్కరించడానికి నాకు తగినంత సమయం లభించింది. నేను మీ అందరి కోసం ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని గుర్తుంచుకోండి” అంటూ ట్విట్ చేశారు.
— sonu sood (@SonuSood) April 17, 2021
కాగా.. సోనూ సూద్ గతేడాది విధించిన కరోనా లాక్‌డౌన్‌లో సమయంలో కలియుగ కర్ణుడిగా నిలిచాడు. ఆకలితో అలమటిస్తూ.. సొంత ఊర్లకు వెళ్లలేని వారందరికీ.. ఆయన చేయూతనందించి తరలించారు. కొంతమందిని ఫ్లైట్‌లల్లో సైతం తరలించారు. ఆయన చేసిన సేవలను దేశంతో, ప్రపంచం మొత్తం కీర్తించింది. ఇప్పటికీ సాయం చేయాలని ప్రాథేయపడే వారందరికీ సాయం చేస్తూ సోనూసూద్ అండగా నిలుస్తున్నాడు. కాగా సోనూసూద్ కరోనా సోకిన విషయం తెలుసుకోగానే ఆయన అభిమానులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ట్విట్టర్, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా ప్రార్థిస్తున్నారు.