Pawan Kalyan: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మహేష్ ట్వీట్.. ఆనందం వ్యక్తం చేస్తున్న అభిమానులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అని తెలిసి ఆయన అభిమానులు ఆందోళనకుగురవుతున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ క్వారంటైన్ లో ఉన్నారు.

  • Rajeev Rayala
  • Publish Date - 11:37 am, Sat, 17 April 21
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మహేష్ ట్వీట్.. ఆనందం వ్యక్తం చేస్తున్న అభిమానులు

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అని తెలిసి ఆయన అభిమానులు ఆందోళనకుగురవుతున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ క్వారంటైన్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సినిమా తారలు సోషల్ మీడియవేదిగా పోస్ట్ లో పెడుతున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ఇటీవల పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమా బ్లాక్ బస్టర్ ,హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ను ప్రశంసిస్తూ మహేష్ ట్వీట్ చేశారు. పవన్ తో పాటు చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు. ఇప్పుడు పవన్ కరోనా బారిన పడ్డారని తెలిసి ఆయన త్వరగా కోలుకోవాలని మహేష్ ట్వీట్ చేసారు. దాంతో పవన్ అభిమానులు, మహేష్ అభిమానులు ఖుష్ అవుతున్నారు. అయితే కొందరు పవన్ మహేష్ అభిమానులు మా హీరో నెంబర్ 1 అంటే.. మా హీరో నెంబర్ 1అంటూ గొడవలు పడుతుంటారు. కానీ పవన్ మహేష్ మధ్య మంచి స్నేహం ఉందని ఇలాంటి పలు సందర్భాల్లో బయటపడుతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ సినిమా హీరోయిన్ నివేద థామస్ కూడా ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actor Vivek: నటుడు వివేక్ హఠాన్మరణంపై అనుమానాలు? తమిళనాడు ఎంపీ సంచలన వ్యాఖ్యలు

RGV Pawan: పవన్‌ కరోనా బారిన పడడంపై స్పందించిన రామ్‌గోపాల్‌ వర్మ.. మండిపడుతున్న పవర్‌ స్టార్‌ అభిమానులు.. ఎందుకంటే..