Kiara – Sidharth: రీల్‌ లైఫ్‌లోనూ మరోసారి జంటగా కనిపించబోతున్న మోస్ట్ రొమాంటిక్ కపుల్‌

చాలా కాలంగా ప్రేమలో ఉండి, రీసెంట్‌గా పెళ్లి చేసుకున్నారు బాలీవుడ్ స్టార్స్ సిద్దార్థ్ మల్హోత్రా, కియార అద్వానీ. ఇంకా వెడ్డింగ్ మూడ్‌లోనే ఉన్న ఈ జంట వెండితెరపై స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.

Kiara - Sidharth: రీల్‌ లైఫ్‌లోనూ మరోసారి జంటగా కనిపించబోతున్న మోస్ట్ రొమాంటిక్ కపుల్‌
Kiara Advani-Sidharth Malhotra
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 19, 2023 | 7:33 PM

బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్‌ మరో సినిమాకు రెడీ అవుతున్నారు. రియల్‌ లైఫ్‌లో ఒక్కటైన ఈ జంట త్వరలో రీల్‌ లైఫ్‌లోనూ మరోసారి జంటగా కనిపించబోతున్నారట. ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేసుందుకు రెడీ అవుతున్నారు స్టార్ మేకర్‌ కరణ్ జోహార్‌. వెండితెర మీద కమర్షియల్ కాంబినేషన్స్‌ సెట్ చేయటంలో కరణ్ జోహార్ స్పెషలిస్ట్‌. ఏ కాంబినేషన్‌లో సినిమా చేస్తే కమర్షియల్‌గా వర్క్ అవుట్ అవుతుందో పర్ఫెక్ట్‌గా తెలిసిన కరణ్ ఇప్పుడు హ్యాపెనింగ్ కపుల్‌ సిద్‌ – కియారాలను రంగంలోకి దించుతున్నారు.

చాలా కాలంగా ప్రేమలో ఉండి, రీసెంట్‌గా పెళ్లి చేసుకున్నారు బాలీవుడ్ స్టార్స్ సిద్దార్థ్ మల్హోత్రా, కియార అద్వానీ. ఇంకా వెడ్డింగ్ మూడ్‌లోనే ఉన్న ఈ జంటను వెండితెర మీద కూడా జంటగా చూపించేందుకు ప్లాట్‌ఫామ్ రెడీ చేస్తున్నారు కరణ్‌ జోహార్‌. గతంలో ఈ జంట కలిసి నటించిన షేర్షా విమర్శలకు ప్రశంసలు అందుకుంది. మెయిన్‌ ప్లాట్‌తో పాటు సినిమాలో సిద్‌ కియారా కెమిస్ట్రీకి ఫుల్ మార్క్స్ పడ్డాయి. అందుకే మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్‌.

ప్రజెంట్ కరణ్ జోహార్‌ బ్యానర్‌లోనే తెరకెక్కుతున్న యోధా సినిమాలో నటిస్తున్నారు సిద్‌. కియారా కూడా సౌత్, నార్త్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే.. ఈ కాంబో సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి పెళ్లి తరువాత చేయబోయే సినిమా ఈ జంటగా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..