Shilpa Shetty: విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్ ?.. విడిపోయామంటూ రాజ్ కుంద్రా ట్వీట్..
"మేము విడిపోయాము. ఈ కష్టకాలంలో మాకు సమయం ఇవ్వాలని దయచేసి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము" అంటూ రాశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా.. వీరిద్దరి నిజంగానే విడిపోయారా ?.. విడిగా అంటే డివోర్స్ తీసుకున్నారా ?.. అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం రాజ్ కుంద్రా చేసిన ట్వీట్ విడాకుల గురించి కాదని.. ఇన్నాళ్లు తనతో ఉన్న మాస్క్ గురించి చెప్పాడని..ఇకపై మాస్క్ ఉపయోగించనని ఇలా ట్వీట్ చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి తన భర్తతో విడాకులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆమె భర్త రాజ్ కుంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సందేహాలను కలిగిస్తోంది. శిల్పా భర్త రాజ్ కుంద్రా తన అధికారిక ఖాతాలో విడిపోతున్నట్లు ప్రకటించాడు. శిల్పా గురించి ప్రస్తావించకుండా.. “మేము విడిపోయాము. ఈ కష్టకాలంలో మాకు సమయం ఇవ్వాలని దయచేసి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము” అంటూ రాశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా.. వీరిద్దరి నిజంగానే విడిపోయారా ?.. విడిగా అంటే డివోర్స్ తీసుకున్నారా ?.. అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం రాజ్ కుంద్రా చేసిన ట్వీట్ విడాకుల గురించి కాదని.. ఇన్నాళ్లు తనతో ఉన్న మాస్క్ గురించి చెప్పాడని..ఇకపై మాస్క్ ఉపయోగించనని ఇలా ట్వీట్ చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు శిల్పా శెట్టి సోషల్ మీడియా ఖాతాలలో విడాకులకు సంబంధించిన ఎలాంటి పోస్టులు కనిపించడం లేదు. అంతేకాదు.. ఆమె గురువారం తన భర్త కొత్త సినిమా UT69 పోస్ట్ చేస్తూ… రాజ్ కుంద్రాకు బెస్ట్ విషెస్ తెలిపింది. దీంతో వీరిద్దరు విడిపోవడం లేదని.. కేవలం రాజ్ కుంద్రా మాత్రమే మాస్క్ గురించి ట్వీట్ చేశాడనే క్లారిటీ వస్తోంది.
రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు వియాన్, సమీషా ఉన్నారు. ఇటీవల రాజ్ కుంద్రా తన బయోపిక్ UT 69 ట్రైలర్ లాంచ్‌లో నీలిచిత్రాల కేసులో జైలు జీవితం గడపడం గురించి మాట్లాడారు. 2021లో రాజ్ కుంద్రా పోర్న్ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయ్యి కొన్నాళ్లు జైలులో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. బెయిల్‌పై విడుదలైనప్పటి నుంచి రాజ్ ముఖాన్ని చూపించకుండా మాస్క్ ధరించి తిరుగుతున్నాడు. చాలా రోజులుగా మాస్క్ తో కనిపించిన రాజ్ కుంద్రా ఇటీవల UT69 ట్రైలర్ లాంచ్ వేడుకలో తన మాస్క్ తొలగించారు.
We have separated and kindly request you to give us time during this difficult period 🙏💔
— Raj Kundra (@onlyrajkundra) October 19, 2023
ఈ సందర్భంగా రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. “నేను నొప్పితో మాత్రమే మాస్క్ ధరించాను. మీడియా విచారణ చాలా బాధాకరం. నిజానికి ఇది నా చట్టపరమైన విచారణ కంటే చాలా బాధాకరమైనది. నేను మీడియాను నిందించను ఎందుకంటే వారు వారి పని చేస్తున్నారు కాబట్టి నేను మాస్క్ ధరించి కప్పిపుచ్చుకోవాల్సి రావడం చాలా బాధాకరం. నా ఇంట్లో ఇప్పటికే స్టార్ ఉంది కానీ ఇప్పుడు నా మాస్క్ కూడా స్టార్ అయిపోయింది. నేను నా జీవితాన్ని సినిమా తీయాలనుకున్నాను. మీ ముందుకు నా సినిమా రాకముందే నేనే మాస్క్ తీసేయాలని అనుకున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








