AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dream Girl 2: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్.. ‘డ్రీమ్ గర్ల్ 2’ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు తండ్రి చేసిన అప్పులతో సతమతమవుతుంటాడు. అదే సమయంలో తన స్నేహితురాలు పరితో ప్రేమలో పడతాడు. వీరిద్దరి పెళ్లికి పరి తండ్రి అడ్డుపడతాడు. తన కూతురితో వివాహం జరిపించాలంటే ఆరు నెలల్లో రూ.25 లక్షలు సంపాదించాలని కండిషన్ పెడతాడు. అందుకు అంగీకరించిన ఆ యువకుడు ఏం చేశాడు ?.. ఆరు నెలల్లో ఎలా డబ్బు సంపాదించాడు ?.. ఆ తర్వాత ఏం జరిగింది ? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

Dream Girl 2: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్.. 'డ్రీమ్ గర్ల్ 2' స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Dream Girl 2 Movie
Rajitha Chanti
|

Updated on: Oct 19, 2023 | 5:19 PM

Share

2019లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన డ్రీమ్ గర్ల్‌కి సీక్వెల్‏గా వచ్చిన సినిమా డ్రీమ్ గర్ల్ 2. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ఈ మూవీలోని కామెడీకి అడియన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. ఇందులో లైగర్ మూవీ ఫేమ్ అనన్య పాండే, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించారు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన డ్రీమ్ గర్ల్ 2 ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం ముందుగా ఆగస్టు 25న విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్మెంట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 20న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ఫ్రాంచైజీ అభిమానులతో ఖచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుందని అధికారికంగా ప్రకటించారు. “ డ్రీమ్ గర్ల్ రాకతో మీ కలలన్నీ 2x మ్యాజిక్, వినోదంతో నిజం కాబోతున్నాయి. రేపు #DreamGirl2ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడండి!” అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా , అనన్య పాండే , పరేష్ రావల్, సీమా పహ్వా, అన్నూ కపూర్, విజయ్ రాజ్, రాజ్‌పాల్ యాదవ్, అస్రానీ, అభిషేక్ బెనర్జీ, మంజోత్ సింగ్ కీలకపాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.100 కోట్లు వరకు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో కూడా అభిమానులను అలరించనుంది.

ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు తండ్రి చేసిన అప్పులతో సతమతమవుతుంటాడు. అదే సమయంలో తన స్నేహితురాలు పరితో ప్రేమలో పడతాడు. వీరిద్దరి పెళ్లికి పరి తండ్రి అడ్డుపడతాడు. తన కూతురితో వివాహం జరిపించాలంటే ఆరు నెలల్లో రూ.25 లక్షలు సంపాదించాలని కండిషన్ పెడతాడు. అందుకు అంగీకరించిన ఆ యువకుడు ఏం చేశాడు ?.. ఆరు నెలల్లో ఎలా డబ్బు సంపాదించాడు ?.. ఆ తర్వాత ఏం జరిగింది ? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.